Telangana MPs: పార్ల‌మెంట్ వ‌ద్దు.. అసెంబ్లీయే ముద్దు అంటున్న తెలంగాణ ఎంపీలు..!

రాష్ట్రంలో చాలా మంది సిట్టింగ్ పార్లమెంటు సభ్యులు.. అసెంబ్లీ సీటీపై మనసు పారేసుకున్నారు. ఎంపీ సీటును వదులుకుని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇంట్రెస్ట్​ చూపుతున్నారట.

Telangana MPs: పార్ల‌మెంట్ వ‌ద్దు.. అసెంబ్లీయే ముద్దు అంటున్న తెలంగాణ ఎంపీలు..!
Telangana Mps
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jan 29, 2022 | 12:24 PM

Telangana Politics: రాష్ట్రంలో చాలా మంది సిట్టింగ్ పార్లమెంటు సభ్యులు.. అసెంబ్లీ సీటీపై మనసు పారేసుకున్నారు. ఎమ్మెల్యే కేవ‌లం ఒక నియోజ‌క‌వ‌ర్గం మాత్ర‌మే కానీ ఎంపీ..6 7 నియోజ‌క‌వ‌ర్గ‌ాల‌కు. ఎమ్మెల్యే(Member of Legislative Assembly) అంటే హైద‌రాబాద్ మాత్ర‌మే కాని ఎంపీ దేశ రాజధాని ఢిల్లి.. కేంద్ర మంత్రులు, కుదిరితే ప్రధాని, రాష్ట్ర‌ప‌తిల‌తో స‌మావేశాలు ఉంటాయి. కాని తెలంగాణ ఎంపీలు(Member of Parliament) మాత్రం ఎమ్మెల్యే ప‌ద‌వే బెట‌ర్ అనే ఫీలింగ్ తో ఉన్నారంట‌. ఎంపీ సీటును వదులుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) పోటీ చేసేందుకు ఇంట్రెస్ట్​ చూపుతున్నారు. ఇందుకు తగ్గట్టుగా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు లీడర్లు తమకు అనుకూలంగా ఉన్న అసెంబ్లీ స్థానంపై స్పెషల్​ ఫోకస్​ పెట్టారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు ఇక్కడి నుంచి పోటీ చేయడం ఖాయమని ఆ నియోజకవర్గంలోని అనుచరులకు, ఓటర్లకు సంకేతాలు ఇస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లో ఈ పరిస్థితి కనిపిస్తోంది.

తెలంగాణ లో దాదాపు 10 మంది ఎంపీలు త‌మ ఇమేజ్ కు పార్ల‌మెంట్ క‌న్న అసెంబ్లీ బెట‌ర్ అని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్, కేటీఆర్‌కు ద‌గ్గ‌ర‌గా ఉండోచ్చ‌ని టీఆర్ఎస్ ఎంపీలు అనుకుంటుంటే.. కేసీఆర్‌తో ఫైట్ చేయాలంటే ఎమ్మెల్యే ప‌ద‌వి బెట‌ర్ అనే ఫీల్ అవుతున్నారు ప్ర‌తిప‌క్ష ఎంపీలు.. 2023లో ఎంపీ నుండి ఎమ్మెల్యేగా పోటి చేయాలకుంటున్న ఎంపీల క‌థ‌లు చూడండి.

సోయం బాపురావు.. అదిలాబాద్ ఎంపీగా ఉన్న భారతీయ జనతా పార్టీ బాపురావు.. వాస్తవానికి ఎమ్మెల్యేగా ఉండడానికే ఇష్ట‌ప‌డుతున్నారు. గ‌తంలో ఉమ్మ‌డి అదిలాబాద్ జిల్లాలోని బోథ్ నియోజ‌క‌వ‌ర్గం ప్రాతినిధ్యం వ‌హించిన అయన.. 2018లో ఓడిపోయి 2019లో ఎంపీగా గేలిచారు. కానీ మ‌న‌సు మాత్రం బోథ్ నియోజకవర్గంపైనే ఉంద‌ని చెబుతున్నారు అనుచ‌రులు. 2023లో మ‌ళ్లీ బోథ్ ఎమ్మెల్యేగా పోటి చేసేందుకు రంగం సిద్థం చేసుకుంటున్నారు.

ధ‌ర్మ‌పురి అర‌వింద్ నిజామాబాద్ ఎంపీ కుడా ఇదే అలోచ‌నతో ఉన్న‌ట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ హవా పెరుగుతున్న నేప‌థ్యంలో ఎమ్మెల్యేగా ఉండేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు అర‌వింద్… వ‌చ్చే 2023 ఎన్నికల్లో అర్మూర్ నుండి బరిలో ఉండేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.. ఆర్మూర్​ నుంచి కుదరకుంటే హైదరాబాద్​లోని ఏదైనా ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.

బండి సంజ‌య్ కుమార్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షులు, ప్రస్తుత కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ సైతం వ‌చ్చే 2023 లో ఏమ్యేల్యేగా పోటి చేస్తున్నారు. 2014,2018 ఎన్నికల్లో క‌రీంన‌గ‌ర్ సీటు నుండి పోటి చేసి ఓడిన బండి సంజ‌య్ అనుహ్యంగా 2019లో క‌రీంన‌గ‌ర్ ఎంపీ అయ్యారు. కానీ త‌న స్టైల్ కు సెంట‌ర్ క‌న్న స్టేట్ బెట‌ర్ అని ఫీలవుతున్నట్లు సమాచారం. క‌రీంన‌గ‌ర్ కానీ వేముల‌వాడ నియోజకవర్గం నుండి కానీ బండి పోటి సిద్ధం అవుతున్న‌ట్లు బీజేపీ వ‌ర్గ‌ాలు చెబుతున్నాయి..

కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి 2014,2019లో మేదక్ ఎంపీగా ఎన్నికైన కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి కూడ మొద‌టి నుండి ఎమ్మెల్యే ప‌ద‌విపైనే మ‌న‌సు ఉంది. అప్ప‌ట్లోనే దుబ్బ‌ాక సీటు అశించిన దివంగ‌త సోలిపేట రామ‌లింగారెడ్డి లాంటి బ‌ల‌మైన నేత అక్క‌డ ప్రాతినిధ్యం వ‌హిస్తుండ‌డంతో కేసీఆర్ ప్ర‌భాక‌ర్ రెడ్డిని ఎంపీగా పంపారు. కానీ ఇప్పుడు ప్ర‌భాక‌ర్ రెడ్డి కూడా 2023లో దుబ్బాక నుండి త‌న అదృష్టం పరిక్షించుకొవాల‌ని చూస్తున్న‌ట్లు తెలుస్తోంది.

అనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి కుడా మొద‌టి నుండి రాష్ట్ర రాజ‌కీయ‌ల‌పైనే అస‌క్తి. కానీ అనుకొని ప‌రిస్థితిలో కొడ‌ంగ‌ల్ ఓడిపోవ‌డంతో మ‌ల్క‌జ్‌గిరి పార్ల‌మెంట్‌కు పోటి చేశారు. అయ‌న కుడా రానున్న ఎన్నికల్లో కొడంగ‌ల్ నుండి కాని ఎల్బీ న‌గ‌ర్ నుండి కానీ, పోటి చేస్తార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

గంగాపురం కిష‌న్ రెడ్డి సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి అంబర్ పేట నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. గతంలో ఈయన ఇక్కడి నుంచే పలుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఎంత బీజీగా ఉన్నా… వీలు దొరికినప్పుడల్లా అంబర్ పేట సెగ్మెంట్​లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను కలుస్తున్నారు. ఇటీవ‌ల కాలంలో అబ‌ర్‌పేట్‌కు స‌మ‌యం కేటాయించ‌లెక‌పోతున్న‌ట్లు క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారుట మంత్రి. పార్టీ అదేశిస్తే 2023లో అంబ‌ర్‌పేట్‌కు తిరిగి రావాల‌ని మంత్రికి కూడా ఉందంట..

కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి న‌ల్గోండలో అనుకొని ప‌రిస్థితిలో ఓడిపోయిన కోమ‌టిరెడ్డి కుడా మ‌ళ్లీ 2023లో న‌ల్గోండ నుండి పోటీ చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం భ‌వ‌న‌గిరి ఎంపీగా ఉన్న అయ‌న మ‌న‌సు కూడా రాష్ట్ర రాజ‌కీయ‌ల మీదే ఉందన్న టాఫిక్ వినిపిస్తోంది.

నలమాద ఉత్త‌మ్ కూమ‌ర్ రెడ్డి ఇక ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కూడా ఇదే బాట‌లో ఉన్నారు. హుజురాబాద్ సీటు గెలిచి 2019లో ఎంపీగా పోటి చేశారు ఉత్త‌మ్. కానీ అయ‌న కుడా మ‌ళ్లి హుజురాబాద్‌కు వెళ్తేనే బాగుంటుంద‌ని అనుచ‌రులు సూచిస్తున్నారు. లెకుంటే ఆ సీటు తమ గుపెట్లో నుండి పోయే ప్ర‌మాదం ఉంద‌ని భావిస్తున్నారంట.. ఉత్త‌మ్ ఏలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి..

నామా నాగేశ్వ‌ర్ రావు టీఆర్ఎస్ నేత నామా కుడా ఎమ్మెల్యే అయితేనే కేసీఆర్‌కు ద‌గ్గ‌ర‌గా ఉండోచ్చ‌ని.. వచ్చే ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉండోచ్చ‌ని లెక్క‌లు వేసుకుంటున్నారు. ఇక అయ‌న ఖ‌మ్మం జిల్లాలో ఏదైన సీటు ఇస్తే బాగుండ‌ని అనుకుంటున్నారు. ఖమ్మం లేదా పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏదైనా ఒక స్థానం నుంచి పోటీ చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు.

మాలోతు క‌విత ప్ర‌స్తుతం మహబూబాబాద్ ఎంపీగా ఉన్న క‌విత త‌న తండ్రి రెడ్యా నాయ‌క్ ప్ర‌తినిధ్యం వ‌హిస్తున్న డోర్న‌క‌ల్ నుండి ఎమ్మెల్యేగా బ‌రిలో ఉండాల‌ని అనుకుంటున్నార‌ని తెలుస్తోంది. ఇందుకు త‌న తండ్రి నుండి సుముఖ‌త వ్యక్తం చేసినట్లు ప్ర‌చారంలో జ‌రుగుతోంది. అయితే.. మాజీ ఎంపీ సీతారాం నాయక్ కూడా ఈ సెగ్మెంట్​ నుంచే పోటీకి ఇంట్రెస్ట్​ చూపుతున్నారు.

గడ్డం రంజిత్ రెడ్డి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా ఎమ్మెల్యే కావాల‌ని అనుకుంటున్నార‌ని సమాచారం.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడ రంజిత్ రెడ్డి ఇక్క‌డ ఉంటేనే బెట‌ర్ అని అనుకుంటున్నార‌ని ప్ర‌చారం నడుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద‌ర్ న‌గ‌ర్ నియోజకవర్గం నుండి బ‌రిలో ఉంటార‌నే ప్ర‌చారం నుడ‌స్తోంది. ప్రస్తుతం ఇక్కడ ప్రకాష్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ తరుఫుననే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

ఇలా 18 మంది పార్లమెుంటు సభ్యుల్లో 11 మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు ఇష్టం చూపిండం రాజ‌కీయంగా అస‌క్తి నెల‌కొంది. మ‌రోవైపు, ఈ 11 స్థానాల్లో ఎంపీలుగా ఎవ‌రు ఉంటారో అనే చ‌ర్చ కూడ మొదలైంది.

Read Also…  Manipur Elections: ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. స్వతంత్ర ఎమ్మెల్యే అషాబ్ ఉద్దీన్ రాజీనామా!

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో