AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణలో తెరుచుకోనున్న విద్యాసంస్థలు.. నేడు అధికారిక ప్రకటన

సెలవులు ముగుస్తుండటం.. పాఠశాలల పునఃప్రారంభంపై ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు ప్రశ్నించడం వల్ల తెలంగాణ ప్రభుత్వం నేడు తన నిర్ణయాన్ని ప్రకటించే ఛాన్స్ ఉంది. మరోవైపు విద్యాసంస్థలు తెరవాలని విద్యార్థుల పేరెంట్స్ నుంచి ఒత్తిడి రావడం కూడా ఓ కారణమే.

Telangana: ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణలో తెరుచుకోనున్న విద్యాసంస్థలు.. నేడు అధికారిక ప్రకటన
Ts Schools
Ram Naramaneni
|

Updated on: Jan 29, 2022 | 11:15 AM

Share

Schools Reopen in Telangana: ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణలో అన్ని విద్యాసంస్థలు తెరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై తన నిర్ణయాన్ని తెలంగాణ సర్కార్(Telangana Government) ఇవాళ(జనవరి 29) అధికారిక ప్రకటన చేయనుంది. సెలవులు 30 వరకే ఉన్నా ఒకరోజు ఆలస్యంగా స్కూల్స్ రీ-ఓపెన్ అవ్వనున్నాయి. పక్క రాష్ట్రాల్లో స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత పరిస్థితులను గమనించింది ప్రభుత్వం. అంతటా సజావుగానే క్లాసులు జరుగుతున్నట్లు గుర్తించి.. ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం సాయంత్రం ఉత్తర్వులు విడుదల చేసే అవకాశం ఉంది. వైద్య ఆరోగ్య శాఖ కూడా  విద్యాసంస్థలు తెరిచేందకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాఠశాలల పునఃప్రారంభం అనంతరం కరోనా నిబంధనలు(covid guidelines) కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సెలవులు ముగుస్తుండటం.. పాఠశాలల పునఃప్రారంభంపై ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు ప్రశ్నించడం వల్ల ప్రభుత్వం నేడు తన నిర్ణయాన్ని ప్రకటించే ఛాన్స్ ఉంది. మరోవైపు విద్యాసంస్థలు తెరవాలని విద్యార్థుల పేరెంట్స్ నుంచి ఒత్తిడి రావడం కూడా ఓ కారణమే. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా సమీపిస్తున్నందున పాఠశాలలు తెరవాలని సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ప్రజంట్ 8, 9, 10వ తరగతుల విద్యార్థులతో పాటు, ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసెస్ నిర్వహిస్తున్నారు. వీటి వల్ల పెద్దగా ఉపయోగం ఉండటం లేదన్నది తల్లిదండ్రుల వెర్షన్. ఇప్పటికే ఇంటర్‌, టెన్త్ పరీక్షల ఫీజు గడువును సర్కార్ పొడిగించింది. వార్షిక పరీక్షల నిర్వహణపై కూడా షెడ్యూల్‌ కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. విద్యా సంస్థలను తెరిచిన వెంటనే ఫైనల్ ఎగ్జామ్స్ షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం.

కాగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి పరీక్షల రద్దు, ప్రమోట్‌ చేయడం వంటివి ఉండబోవని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబిత స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీనివల్ల స్టూడెంట్స్ నష్టపోతారని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు ఇలాంటి ఆశలు పెట్టుకోకుండా వీలైనంత వరకూ పరీక్షల్లో విజయం సాధించేందుకు కష్టపడాలని సూచించారు.

Also Read:  శ్మశానం దగ్గర్లోని నిర్మానుష్య ప్రాంతం వద్ద కనిపించిన రంధ్రాలు.. దిగి చెక్ చేయగా అద్భుతం

Nellore District: పొలం పనులు చేస్తుండగా.. బయటపడ్డ 6 బీరువాలు, ఒక బైక్.. ఎంక్వైరీ చేయగా