తెలంగాణలో సంచలనంగా మారిన మాజీ IAS, ప్రస్తుత IPSల మధ్య వివాదం.. ఇద్దరి మధ్య లింకేంటి?
IAS అధికారిగా సుదీర్ఘకాలం తెలుగు రాష్ట్రాల్లో పని చేసిన భన్వర్‌లాల్ 2017లో రిటైరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా ఆయన సుపరిచితుడు. జూబ్లీహిల్స్‌లో భన్వర్‌లాల్‌కు ఓ బిల్డింగ్ ఉంది. 2014లో ఈ ఇంటికి సంబంధించి ఓర్సు సాంబశివరావు అనే వ్యక్తితో 5 ఏళ్లకు రెంటల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. 2019లో ఈ ఒప్పందం ముగిసినా.. ఇంటిని తనకు తిరిగి ఇవ్వలేదన్నది భన్వర్‌లాల్ ఆరోపిస్తున్నారు..

తెలంగాణలో మాజీ IAS, ప్రస్తుత IPSల మధ్య వివాదం సంచలనంగా మారింది. ఓ ఫోర్జరీ కేసుకు సంబంధించి IPS అధికారి నవీన్‌కుమార్‌ను CCS పోలీసులు 8 గంటల పాటు విచారించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భన్వర్‌లాల్ కుటుంబం ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. అసలు వీరిద్దరి మధ్య ఉన్న కేసు ఏంటి.. IPSను విచారించడానికి కారణం ఏంటి..?
IAS అధికారిగా సుదీర్ఘకాలం తెలుగు రాష్ట్రాల్లో పని చేసిన భన్వర్‌లాల్ 2017లో రిటైరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా ఆయన సుపరిచితుడు. జూబ్లీహిల్స్‌లో భన్వర్‌లాల్‌కు ఓ బిల్డింగ్ ఉంది. 2014లో ఈ ఇంటికి సంబంధించి ఓర్సు సాంబశివరావు అనే వ్యక్తితో 5 ఏళ్లకు రెంటల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. 2019లో ఈ ఒప్పందం ముగిసినా.. ఇంటిని తనకు తిరిగి ఇవ్వలేదన్నది భన్వర్‌లాల్ ఆరోపిస్తున్నారు. 2019 తర్వాత ఈ కేసు మరో మలుపు తిరిగింది. 2019లో సాంబశివరావు స్థానంలో ఇంట్లోకి IPS అధికారి నవీన్‌కుమార్ దిగారు. ఆ తర్వాత కొన్ని డాక్యుమెంట్లు తెరమీదికి వచ్చాయి. దీంతో తమ ఆస్తులకు సంబంధించి నకిలీ పత్రాలను సృష్టించారని భన్వర్‌లాల్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పత్రాలను ఓర్సు సాంబశివరావు, ఆయన భార్య రూపా డింపుల్ కలిసి తయారు చేశారని, వీటికి IPS అధికారి నవీన్‌కుమార్ సహకరించారన్నది భన్వర్ లాల్ ఆరోపణ.
భన్వర్‌లాల్ కుటుంబం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన CCS పోలీసులు.. డాక్యుమెంట్లను పరిశీలించి ఫేక్ అని తేల్చారు. డిసెంబర్ 22న ఓర్సు సాంబశివరావు, ఆయన భార్య రూపా డింపుల్ ఇద్దరినీ అరెస్ట్ చేశారు. విషయం తెలిసిన IPS అధికారి నవీన్‌కుమార్ ఆ రోజు నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. భన్వర్‌లాల్ ఇంటిని కబ్జా చేసేందుకు జరిగిన కుట్రలో భాగంగానే నవీన్ కుమార్ సహకారంతో నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి.. భన్వర్‌లాల్ సంతకాన్ని ఫోర్జరీ చేశారని అనుమానిస్తున్నారు. IPS అధికారి నవీన్‌కుమార్ ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గత నెల 17న భన్వర్‌లాల్ భార్య మనీలాల్ CCS పోలీసులకు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఐపీఎస్ నవీన్ కుమార్ దత్త కుమారుడు సాకేత్.. నాన్నను అన్యాయంగా అదుపులోకి తీసుకున్నారని.. ఇది సివిల్ మ్యాటర్, కోర్టులో కేసు నడుస్తుందన్నారు. CCS పోలీసులు తీరుపై కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ వేస్తామన్నారు. ప్రమోషన్ వచ్చే సమయంలో కావాలనే నాన్నను ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఐపీఎస్ నవీన్ కుమార్ పోలీసుల విచారణ ముగిశాక పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. మ్యాటర్ ఆల్రెడీ కోర్టులో ఉందని.. సివిల్ మ్యాటర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. వాళ్లు అడిగిన సమాచారాన్ని ఇచ్చానన్నారు. త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తానని.. లీగల్‌గానే ముందుకు వెళ్తానన్నారు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారి మధ్య వివాదం ఈనాటిది కాదని తెలుస్తుంది. సఖ్యతగా ఉన్న కుటుంబాల మద్య డబ్బు, ఆస్తి అగ్గి రాజేశాయి. తెలిసిన ఉన్నతాధికారుల సహకారంతో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. 35 లక్షలు ఇచ్చామని ఐపీఎస్ అంటే లేదు పోర్జరీ అని ఐఏఎస్ చెప్తున్నారు. చూడాలి ఈ వివాదం ఎక్కడి వరకు వెళుతుందో.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








