Cyberabad: సైబర్ క్రైమ్ ఫిర్యాదులపై సీపీ మహంతి కీలక సూచనలు

ఇటీవల కాలంలో నెట్టింట్లో బూచోళ్లు ఎక్కువయ్యారు. అడ్డమైన లింకులు పెట్టి అడ్డంగా దోచుకుని సైబర్ ముఠాలు.. వైఫైలా మన చుట్టూరా ఉన్నాయి. అలాంటి వాళ్ల ఉచ్చులో పడుతున్న బాధితులకు కొన్ని కీలక సూచనలు చేశారు పోలీసులు.

Cyberabad: సైబర్ క్రైమ్ ఫిర్యాదులపై సీపీ మహంతి కీలక సూచనలు
Cyberabad Cp Avinash Mohanty
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 27, 2023 | 9:50 PM

ఇన్‌స్టా.. స్నాప్‌చాట్‌.. ఫేస్‌బుక్‌.. వాట్సాప్.. ఇలా అన్ని రకాల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి కొంతమంది సైబర్ నేరగాళ్లు నిలువునా దోచేస్తున్నారు. రోజూ కొన్ని వేల మంది అమాయకులు సైబర్ చీటర్స్ చేతిలో మోసపోయి.. లక్షలాది రూపాయల డబ్బు పోగొట్టుకుంటున్నారు. అలాంటి బాధితులు ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు పోలీసులు. సైబర్ క్రైమ్స్ కేసుల ఎఫ్‌ఐఆర్‌ విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

మోసగాళ్ల చేతిలో రూ.50 వేల లోపు సొమ్ము పోగొట్టుకున్న సైబర్ క్రైమ్ బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి కోరారు. కేసుల నమోదు కోసం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను ఆశ్రయించేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి ఈ ఆదేశాలు జారీ చేశారు. “సైబరాబాద్‌కు విస్తారమైన అధికార పరిధి ఉంది. కేసు నమోదు చేయడానికి, ప్రజలు గచ్చిబౌలిలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు వస్తున్నారు. కోల్పోయిన మొత్తం రూ. 50,000 లోపు ఉంటే అన్ని స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్‌లకు పిటీషన్‌లను స్వీకరించాలని ఆదేశాలు జారీ చేశాం. ” అని అవినాష్ మొహంతి అన్నారు. సైబర్‌ఫ్రాడ్ బాధితులు రూ. 50,000 కంటే ఎక్కువ నష్టపోతే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్ పొందవచ్చు అని చెప్పారు.

ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోతోందనీ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. స్పామ్ లింక్‌లు, ఫ్రాడ్ అప్లికేషన్లను క్లిక్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలంటున్నారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..