Hyderabad: బార్లా తెరుచుకుంటున్న బార్లు.. నిబంధనలను బేఖాతర్‌ చేస్తూ..

యధేచ్చగా అమ్మకాలు చేస్తూ ప్రభుత్వ నిర్ణయానికి భారీగా గండికొడుతున్నారు. ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవడంలో నిరంతరం పని చేయాల్సిన స్థానిక ఎక్సైజు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే విమర్శలు వినబడుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను బార్ల నిర్వాహకులు ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఎక్సైజ్‌ చట్టంలో బార్ల నిర్వహణ వేళలు స్పష్టంగా నిర్థేశించారు...

Hyderabad: బార్లా తెరుచుకుంటున్న బార్లు.. నిబంధనలను బేఖాతర్‌ చేస్తూ..
Bars In Hyderabad
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Narender Vaitla

Updated on: Dec 27, 2023 | 8:32 PM

రాష్ట్రంలో బార్ల నిర్వాహకులు విచ్చలవిడి అమ్మకాలకు తెగబడుతున్నారు. అధికారుల కనుసన్నల్లోనే బార్లలో 24 గంటల పాటు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీలో శృతిమించుతోంది. నిర్థేశిత సమయం మించిన తర్వాత అధిక రేట్లకు మద్యం విక్రయాలు జరుగుతున్నా, ఎక్సైజు, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఊసేలేదు. ఎవరైనా అదేమని ప్రశ్నిస్తే.. ‘నిజమా? మా దృష్టికి రాలేదే’.? అంటూ… అమాయకపు చూపులు చూడటం అధికారులకు పరిపాటిగా మారింది. ఒకరిద్దరు అధికారులైతే బెల్టు షాపుల కట్టడి కోసమే వదిలేస్తున్నామంటూ అతి తెలివి సమాధానం చెపుతున్నారు. బార్లలో నిరంతర విక్రయాలకు కొందరు రాజకీయ పార్టీల నేతలు కూడా సహకరిస్తున్నారని వాదనలు వినిపిస్తాయి.

యధేచ్చగా అమ్మకాలు చేస్తూ ప్రభుత్వ నిర్ణయానికి భారీగా గండికొడుతున్నారు. ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవడంలో నిరంతరం పని చేయాల్సిన స్థానిక ఎక్సైజు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే విమర్శలు వినబడుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను బార్ల నిర్వాహకులు ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఎక్సైజ్‌ చట్టంలో బార్ల నిర్వహణ వేళలు స్పష్టంగా నిర్థేశించారు. ఉదయం 10గంటల నుంచి రాత్రి 12గంటల వరకు బార్లలో మద్యం అమ్మకాలు జరపాల్సి ఉంటుంది. రాత్రి 10గంటల నుంచి 11గంటల వరకు గంట వ్యవధి ఆహార పదార్థాల కోసం అదనంగా ఇస్తారు.

ఇదే మద్యం షాపులైతే ఉదయం 11గంటల నుంచి రాత్రి 9గంటల వరకు, రాత్రి 9గంటల నుంచి రాత్రి 10గంటల వరకు నగదు లావాదేవీలు సరిచూసుకునేందుకు వ్యవధి ఇచ్చారు. మద్యం షాపులతో పోల్చితే బార్లలో 30శాతం వరకు అదనపు రేట్లు వసూలు చేస్తారు. అయితే ఉదయం మద్యం షాపులు తెరిచేందుకు సమయం ఎక్కువగా ఉండటంతో బార్ల నిర్వాహకులు ఈలోగానే పెద్ద ఎత్తున అమ్మకాలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. పైగా రాత్రి 12గంటల తర్వాత బార్ల షట్టర్లు మూసి వెనుక మార్గాల్లో అమ్మకాలు చేపడుతున్నారు. ప్రభుత్వం నిర్థేశించిన సమయాలతో నిమిత్తం లేకుండా వీరు ఇష్టారాజ్యంగా అమ్మకాలు జరుపుతున్నారు

నిర్థేశిత వేళల తర్వాత జరిపే అమ్మకాలపై అదనపు రేట్లు వసూలు చేస్తున్నారనే విమర్శలు వినియోగదారుల నుంచి వినబడుతున్నాయి. వెనుక నుంచి బాహాటంగానే అమ్మకాలు జరుపుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక సిబ్బందిని నియమించారు. అదనపు వేళల్లో జరిపే అమ్మకాలతో సిబ్బంది జీతాలు, ఎక్సైజు, పోలీసు తదితర నెలవారీ మామూళ్లు చెల్లించాల్సి ఉంటుందని నిర్వాహకులే చెపుతున్నారు. సాధారణ సమయాల్లో మద్యం షాపులతో పోల్చితే 30శాతం అదనపు రేట్లు ఉన్నాయి. రాత్రి వేళల్లో.. అమ్మకపు వేళలు లేని సమయంలో మరో 30శాతం వసూలు చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మద్యం వ్యసనపరుల జేబులను బార్ల నిర్వాహకులు గుల్ల చేస్తున్నారని చెప్పొచ్చు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.