AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganja Selling: నగరంలో పెద్ద మొత్తంలో పట్టుబడిన గంజాయి.. దర్యాప్తులో షాకింగ్ నిజాలు

గంజాయి అమ్ముతున్న ఇద్దరు నిందితులను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు మొఘల్ పురా పోలీసులు కలిసి పట్టుకున్నారు. నిందితుల వద్ద నుండి 5కేజీల 900గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు మొఘల్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని మెజ్బాన్ హోటల్ వద్ద గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్, మొఘల్ పురా పోలీసులు వారి సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు.

Ganja Selling: నగరంలో పెద్ద మొత్తంలో పట్టుబడిన గంజాయి.. దర్యాప్తులో షాకింగ్ నిజాలు
Illigal Ganja Selling
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Dec 27, 2023 | 11:14 PM

Share

గంజాయి అమ్ముతున్న ఇద్దరు నిందితులను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు మొఘల్ పురా పోలీసులు కలిసి పట్టుకున్నారు. నిందితుల వద్ద నుండి 5కేజీల 900గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు మొఘల్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని మెజ్బాన్ హోటల్ వద్ద గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్, మొఘల్ పురా పోలీసులు వారి సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. సమాచారం అందుకున్న ప్రదేశానికి వెళ్లి చూడగా జావీద్ అనే వ్యక్తి తన ఆటోలో గంజాయి దాచి అమ్ముతున్నాట్లు గుర్తించారు పోలీసులు. ఆటో తనిఖీ చేయగా 87 గంజాయి ప్యాకెట్లు దొరికాయి. జావీద్‎ను అదుపులోకి తీసుకొని విచారించగా పురానా పూల్ జుమ్మే రాత్ బజారుకు చెందిన వినోద్ సింగ్ వద్ద నుండి కొనుగోలు చేసి అమ్ముతున్నట్లు తెలిపాడు.

దీనిపై దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు పురానా ఫుల్ జుమ్మేరాత్ బజార్ వద్ద వినోద్ సింగ్‎ను అదుపులోకి తీసుకొని విచారించారు. అతని వద్ద నుండి 242 ఎండు గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు టేప్ చుట్టి ఉన్న మరో రెండు బండలోని 2కేజీల 900గ్రాముల గంజాయి దొరికింది. ఇద్దరి వద్ద నుండి మొత్తం 5కేజీల 900గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒక్క ప్యాకెట్‎లో 10గ్రాముల ఎండు గంజాయి ఉందని తెలిపారు పోలీసులు. వినోద్ సింగ్ ఈ గంజాయిని ఆంధ్రప్రదేశ్‎లోని వైజాగ్ నుండి శ్రీను అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేస్తున్నట్లు చెప్పాడు. వాటిని హైదరాబాద్‎కు తెచ్చి ప్యాకెట్లుగా తయారు చేసి జావీద్ లాంటి వారికి అమ్ముతున్నట్లు సౌత్ జోన్ అదనపు డీసీపీ షేక్ జహంగీర్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో ఛత్రినాక ఏసీపీ జి, రమేష్, సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ మధు‎సుధన్, మొగల్ పురా ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పగలు మండే ఎండలు.. సాయంత్రానికి చిరుజల్లులు
పగలు మండే ఎండలు.. సాయంత్రానికి చిరుజల్లులు
దీదీ కోటలో దాదా.. బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణం..
దీదీ కోటలో దాదా.. బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణం..
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే