Ration Card: సోషల్ మీడియాలో తెల్లరేషన్ కార్డులపై అసత్య ప్రచారాలు.. స్పందించిన అధికారులు..
గత వారం రోజులుగా అనేక మంది అమాయకులు మీ-సేవ కేంద్రాల ద్వారా ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం వందల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. సంబంధిత ఎమ్మర్వో కార్యాలయాలను కూడా సందర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో ఏఐఎంఐఎం ఎమ్మెల్యే ప్రకటనలను చూసి తెలంగాణ ప్రభుత్వం తాజాగా దరఖాస్తులు తీసుకుంటున్నట్లు అభిప్రాయపడ్డారు.

గత వారం రోజులుగా అనేక మంది అమాయకులు మీ-సేవ కేంద్రాల ద్వారా ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం వందల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. సంబంధిత ఎమ్మర్వో కార్యాలయాలను కూడా సందర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో ఏఐఎంఐఎం ఎమ్మెల్యే ప్రకటనలను చూసి తెలంగాణ ప్రభుత్వం తాజాగా దరఖాస్తులు తీసుకుంటున్నట్లు అభిప్రాయపడ్డారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు కొత్త తెల్ల రేషన్ కార్డులను జారీ చేస్తు్న్నట్లు ఈ ప్రకటన సారాంశం. తెల్ల రేషన్ కార్డు దరఖాస్తులు అంటూ వచ్చిన ప్రభుత్వ ప్రకటనపై ఆరా తీయడానికి ఈరోజు అమ్జెద్ ఉల్లా ఖాన్, అసిస్టెంట్ సప్లై ఆఫీసర్ (సర్కిల్-1)ని సందర్శించారు.
దీనిపై స్పందించిన అసిస్టెంట్ సప్లై ఆఫీసర్ (సర్కిల్-1) నుండి ఎటువంటి ఆదేశాలు లేవని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించడానికి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని తెలిపారు. అనంతరం అమ్జెద్ ఉల్లా ఖాన్ డబీర్‌పురాలోని మండల రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి మహిళా తహశీల్దార్‌ను కలిశారు. తాజా ఆదాయ ధృవీకరణ పత్రాల జారీ కోసం తమకు దాదాపు 2300 దరఖాస్తులు వచ్చాయని, అయితే కొత్త రేషన్ కార్డుల విషయంపై తెలంగాణ ప్రభుత్వం నుండి తనకు ఎటువంటి ఉత్తర్వులు రాలేదని ఆమె అన్నారు.
2023 డిసెంబర్ 28 నుండి 2024 జనవరి 06 వరకు ప్రజా పాలన అనే ప్రభుత్వ కార్యక్రమం ఉందని తెలిపారు అధికారులు. అందులో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు హామీలకు సంబంధించిన ప్రజా పాలన ఫారమ్‌లను జారీ చేసే బాధ్యతను జీహెచ్ఎంసీ అధికారులకు అప్పగించామని తహశీల్దార్‌తో పాటు సహాయ పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే వారు తమ సంబంధిత పౌర సరఫరాల కార్యాలయంలో లేదా ప్రజాపాలన కార్యక్రమంలో ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




