Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SCR: సౌత్‌ సెంట్రల్‌ రైల్వే మరో అరుదైన ఘనత.. అతి తక్కువ సమయంలో..

దక్షిణ మధ్య రైల్వే సరుకు రవాణా లోడింగ్ విభాగంలో అత్యుత్తమ పనితీరును కనబరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 26, 2023 నాటికి 100 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ సరుకును లోడ్ చేయడంలో కీలకమైన మైలురాయిని అధిగమించింది. దీనిని సాధించడానికి కేవలం 270 రోజులు మాత్రమే తీసుకుంది . ఇది గత ఆర్థిక సంవత్సరం 2022-23లో 284 రోజులలో...

SCR: సౌత్‌ సెంట్రల్‌ రైల్వే మరో అరుదైన ఘనత.. అతి తక్కువ సమయంలో..
Scr Record
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 27, 2023 | 4:30 PM

దక్షిణ మధ్య రైల్వే మరో అరుదైన ఘనతను సాధించింది. రవణా విభాగంలో రికార్డు స్థాయిలో 100 మిలియన్‌ టన్ను లోడింగ్‌ను అధిమగించింది. ఈ కీలకమైన మైలురాయిని గత ఆర్థిక సంవత్సరాల కంటే తక్కువ సమయంలోనే చేరుకుంది. కేవలం 9 నెలల 26 రోజుల్లోనే సౌత్‌ సెంట్రల్ రైల్వే ఈ ఘనతను సాధించింది.

దక్షిణ మధ్య రైల్వే సరుకు రవాణా లోడింగ్ విభాగంలో అత్యుత్తమ పనితీరును కనబరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 26, 2023 నాటికి 100 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ సరుకును లోడ్ చేయడంలో కీలకమైన మైలురాయిని అధిగమించింది. దీనిని సాధించడానికి కేవలం 270 రోజులు మాత్రమే తీసుకుంది . ఇది గత ఆర్థిక సంవత్సరం 2022-23లో 284 రోజులలో, 2021-22లో 317 రోజులతో సాధించిన అత్యుత్తమ సమయాలతో పోల్చితే, సరుకు రవాణాలో 100 మిలియన్ టన్నులను అధిగమించడానికి జోన్ సాధించిన వేగవంతమైన సమయం ఇదే.

రైలు రవాణా వైపు నూతన వస్తువులను ఆకర్షించడానికి జోన్ అనేక చురుకైన చర్యలు తీసుకోవడంతో పాటు , అదే సమయంలో ఇప్పటికే ఉన్న సరుకు రవాణా వ్యవస్థను కూడా బలోపేతం చేస్తోంది. సరుకు రవాణాను నిర్వహించే టెర్మినల్లు నిరంతరం మెరుగుపడుతుండగా, సరుకులను సకాలంలో అందజేయడం కోసం సరుకు రవాణా రైళ్ల కదలికను కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. సరుకు రవాణా లోడింగ్‌లో వృద్ధి మొత్తం సరుకు రవాణా విభాగంలో కనిపించింది, గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అన్ని వస్తువులు అధిక లోడింగ్ స్థాయిలను అధిగమించాయి.

సరుకు రవాణా వినియోగదారుల నుంచి డిమాండ్‌ను నిరంతరం పర్యవేక్షించడం ద్వారా వ్యాగన్‌లు సకాలంలో సరఫరాను అందిస్తున్నాయి. వస్తువుల వారీగా లోడింగ్‌లో విషయానికొస్తే.. 50.635 మిలియన్ టన్నుల బొగ్గు, 25.226 మిలియన్ టన్నుల సిమెంట్, 5.961 మిలియన్ టన్నుల ఎరువులు, 5.161 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 3.396 మిలియన్ టన్నుల ఉక్కు కర్మాగారాలకు సంబంధించిన ముడి పదార్థాలు, 2.722 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం, 7.752 మిలియన్ టన్నుల ఇతర వస్తువులు కలిపి మొత్తం 100.853 మిలియన్ టన్నులుగా ఉంది.

Scr

ఇక బొగ్గు గనుల నుంచి బొగ్గు రవాణాపై జోన్ ప్రత్యేక దృష్టి సారించడంతో కోల్ లోడింగ్ పుంజుకుంది. భద్రాచలం – సత్తుపల్లి మధ్య ప్రత్యేకమైన కొత్త రైలు మార్గం 2023లో బొగ్గు రవాణా కోసం ప్రారంభించారు. వీటితో పాటు, సిమెంట్, ఇనుప ఖనిజం, ఆహార ధాన్యాలు, ఎరువుల లోడింగ్ కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో అధిక స్థాయిలో జరిగింది. ఈ అంశాలన్నీ తక్కువ వ్యవధిలో జోన్ ద్వారా అత్యుత్తమ పనితీరును నమోదు చేయడంలో సహాయపడ్డాయి.

South Central Railway

 

అద్భుతమైన పనితీరును కనబరిచి, సరకు రవాణాలో 100 మిలియన్‌ టన్నుల మైలు రాయిని అధిగమించినందుకు గాను దక్షిణ మధ్య రైల్వే ఆపరేషన్స్ అండ్‌ కమర్షియల్ బృందాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ అభినందించారు. జోన్ లో సరుకు రవాణాను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తద్వారా ఉత్తమ ఫలితాలు సాధించగలిగామని ఆయన చెప్పుకొచ్చారు. రైల్వే మంత్రిత్వ శాఖ విధాన సంస్కరణలు, వినూత్న చొరవల ఫలితంగా సరుకు రవాణా పరంగా జోన్ అసాధారణమైన పనితీరును నమోదు చేయడంలో సహాయపడ్డాయని, సరుకు రవాణాలో కొత్త పుంతలు తొక్కేందుకు వీలుగా మిగిలిన ఆర్థిక సంవత్సరంలో ఇదే జోరును కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

IPL 2025 Points Table: తొలి ఓటమితో ఆర్‌సీబీకి బిగ్ షాక్..
IPL 2025 Points Table: తొలి ఓటమితో ఆర్‌సీబీకి బిగ్ షాక్..
RCB vs GT: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..
RCB vs GT: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..
శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!
శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!
కోహ్లీ అహాన్ని దెబ్బ తీసిన రోహిత్ మాజీ ఫ్రెండ్.. అసలెవరీ అర్షద్?
కోహ్లీ అహాన్ని దెబ్బ తీసిన రోహిత్ మాజీ ఫ్రెండ్.. అసలెవరీ అర్షద్?
Video: 105 మీటర్ల సిక్స్‌‌తో సిరాజ్‌ హార్ట్ బ్రేక్ చేసిన సాల్ట్
Video: 105 మీటర్ల సిక్స్‌‌తో సిరాజ్‌ హార్ట్ బ్రేక్ చేసిన సాల్ట్
అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..!
అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..!
తండ్రి కానున్న స్టార్ కమెడియన్.. అట్టహాసంగా భార్య సీమంతం.. ఫొటోస్
తండ్రి కానున్న స్టార్ కమెడియన్.. అట్టహాసంగా భార్య సీమంతం.. ఫొటోస్
కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ ప్లేయర్లు
కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ ప్లేయర్లు
ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు..!
ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు..!
చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?
చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?