AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Year Rules: హైదరాబాదీలు బీ అలర్ట్‌.. డిసెంబర్ 31న ఈ తప్పులు చేశారో..

కొత్తేడాదికి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పేందుకు ప్రజలంగా సిద్ధమవుతున్నారు. పాతేడాదికి వీడ్కోలు చెప్పేందుకు ఇప్పటికే కొందరు ట్రిప్స్‌ కూడా ప్లాన్‌ చేశారు. ఇక డిసెంబర్‌ 31వ తేదీ రాత్రి హైదరాబాద్‌లో సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలోనే నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా, సైబరాబాద్‌ ట్రాఫిక పోలీసులు కొన్ని మార్గదర్శకాలను విడుదుల చేశారు..

New Year Rules: హైదరాబాదీలు బీ అలర్ట్‌.. డిసెంబర్ 31న ఈ తప్పులు చేశారో..
Hyderabad
Vijay Saatha
| Edited By: |

Updated on: Dec 27, 2023 | 7:09 PM

Share

కొత్తేడాదికి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పేందుకు ప్రజలంగా సిద్ధమవుతున్నారు. పాతేడాదికి వీడ్కోలు చెప్పేందుకు ఇప్పటికే కొందరు ట్రిప్స్‌ కూడా ప్లాన్‌ చేశారు. ఇక డిసెంబర్‌ 31వ తేదీ రాత్రి హైదరాబాద్‌లో సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలోనే నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా, సైబరాబాద్‌ ట్రాఫిక పోలీసులు కొన్ని మార్గదర్శకాలను విడుదుల చేశారు..

కొన్ని మార్గాల మూసివేత..

నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుపై రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విమానాశ్రయం వెళ్లే వాహనాలకు తప్ప ఇతర లైట్ మోటార్ వాహనాలకు అనుమతి లేదు.

* PVNR ఎక్స్‌ప్రెస్‌ వే రాత్రి రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విమానాశ్రయం వెళ్లే వాహనాలకు తప్ప ఇతర వాహనాలకు అనుమతి లేదు.

* శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, బయో డైవర్సిటీ ఫ్లైఓవర్లు (1 & 2), షేక్ పేట్ ఫ్లైఓవర్, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్, రోడ్ నెం.45 ఫ్లైఓవర్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, సైబర్ టవర్ ఫ్లైఓవర్, ఫోరమ్ మాల్-JNTU ఫ్లై ఓవర్, ఖైత్లాపూర్ ఫ్లై ఓవర్, బాబు జగ్జీవన్ రామ్ ఫ్లై ఓవర్ (బాలానగర్) రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు మూసివేస్తారు.

* క్యాబ్స్‌/టాక్సీ/ఆటో రిక్షాల డ్రైవర్లు/ఆపరేటర్లు కచ్చితంగా యూనిఫామ్ ధరించాలి అలాగే అవసరమైన అన్ని డాక్యూమెంట్స్ వెంట ఉంచుకోవాలి.

* క్యాబ్ డ్రైవర్లు ఎట్టి పరిస్థితులల్లోనూ రైడ్ నిరాకరించకూడదు. ఇది మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 178 ప్రకారం ఉల్లంఘన, ఉల్లంఘించిన వారికి రూ. 500/- జరిమానా విధించబడుతుంది. ఎవరైనా ఇలాంటి ఉల్లంఘనకు పాల్పడితే బండి నెంబర్, సమయం, ప్రదేశం మొదలైన వివరాలతో వాట్సాప్ 9490617346 కు ఫిర్యాదు చేయవచ్చు.

* ప్రజలతో అనుచితంగా ప్రవర్తించకూడదు లేదా అదనపు ఛార్జీలు డిమాండ్ చేయకూడదు.

బార్‌, పబ్‌, క్లబ్‌లకు సూచనలు..

* బార్‌, పబ్‌, క్లబ్‌లు తమ ప్రాంగణంలో మద్యం సేవించిన కస్టమర్లను వాహనాలు నడపడానికి అనుమతిస్తే, నేరాన్ని ప్రోత్సహించినందుకు సంబంధిత యాజమాన్యంపై చర్యలు తీసుకుంటారు.

* కస్టమర్లు తాగి వాహనాలు నడపడం వల్ల జరిగే దుష్పరిణామాలపై ఖచ్చితంగా అవగాహన కల్పించాలి. మద్యం సేవించిన వారి ప్రయాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయాలి. మద్యం తాగిన వ్యక్తులు తమ ప్రాంగణంలో వాహనం నడపకుండా ఆపాలి.

సాధారణ ప్రజలకు సూచనలు..

* ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంప్, ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా నడపడం వంటి ప్రమాదకర ఉల్లంఘనలు చేసే వారిని గుర్తించేందుకు ప్రత్యేక కెమెరాలు అమర్చారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.

* సైబరాబాద్ పరిధిలోని అన్ని రహదారులపై రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ & డ్రైవింగ్పై విస్తృత తనిఖీలు నిర్వహిస్తారు.

* సరైన పత్రాలు సమర్పించని పక్షంలో వాహనాలను తాత్కాలికంగా పోలీస్ వారు వారి కస్టడీలోకి తీసుకుంటారు.

* చట్ట ప్రకారం పబ్లిక్ రోడ్లపై ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటించడంతో పాటు పత్రాలను చూపించడం వాహన డ్రైవర్ల విధి. ట్రాఫిక్ పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు.

* చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా లేదా మైనర్ డ్రైవింగ్ చేస్తే వాహనాన్ని నిర్బంధంలోకి తీసుకోబడును, వాహన యజమాని, డ్రైవర్ ఇద్దరూ న్యాయస్థానంలో ప్రాసిక్యూట్ చేయబడతారు.

* వాహనాలలో అధిక-డెసిబెల్ సౌండ్/మ్యూజిక్ సిస్టమ్లను ఉపయోగించడం నిషేధించబడింది. ఒకవేళ అలా చేస్తే తదుపరి చర్యల కోసం వాహనాలు నిర్బంధించబడతాయి మరియు RTO అధికారికి పంపబడతాయి.

* నంబరు ప్లేట్లు లేని వాహనాలు నడిపితే, ఆ వాహనాలను పోలీసులు తమ అదుపులోకి తీసుకుంటారు.

* వాహనాలలో కిక్కిరిసి ప్రయాణించడం/వాహనాల పై భాగంలో ప్రయాణించడం/బహిరంగ ప్రదేశాల్లో ఇబ్బంది కలిగించడం వంటివి చేసినా కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు.

* ట్రాఫిక్ పోలీసులు ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, మితిమీరిన శబ్దాలు, ప్రమాదకరమైన డ్రైవింగ్, ట్రిపుల్/మల్టిపుల్ రైడింగ్ మొదలైన వాటిపై తగిన కేసులను బుక్ చేస్తారు.

* పబ్లిక్ రోడ్లపై డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా, బాధ్యతతో మరియు సురక్షితంగా ప్రయాణించాలి.

మద్యం సేవించి వాహనం నడిపితే..

* మద్యం తాగి వాహనం నడిపే ప్రతి ఒక్కరిపై మోటార్ వెహికల్స్ యాక్ట్, 1988లోని u/s 185 డిడి కేసులు బుక్‌ చేస్తారు. వారందరినీ నిర్ణీత సమయంలో కోర్టుకు హాజరుపరుస్తారు.

* మొదటి నేరానికి జరిమానా రూ. 10000 లేదా 6 నెలల వరకు జైలు శిక్ష. రెండవ లేదా అంతకంటే ఎక్కువసార్లు నేరానికి పాల్పడితే రూ. 15000 మరియు లేదా 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు.

* మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 19 ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ కోసం వారి డ్రైవింగ్ లైసెన్స్‌లను స్వాధీనం చేసుకుని సంబంధిత RTOలకు పంపిస్తారు.

* మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా ఎవరైనా రోడ్డు ప్రమాదానికి పాల్పడి, మరణానికి కారణమైనట్లయితే, ఐపీసీలోని U/s 304 పార్ట్-II (Culpable homicide not amounting to murder) క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. అరెస్టు చేసి జైలుకు పంపిస్తారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
అడవిలో ఉబ్బిన పొట్టతో కదలకుండా కనిపించిన కొండచిలువ..
అడవిలో ఉబ్బిన పొట్టతో కదలకుండా కనిపించిన కొండచిలువ..
రత్నాల గనిలో దొరికిన అపురూప నిధి..11,000 క్యారెట్ల భారీ కెంపు, ధర
రత్నాల గనిలో దొరికిన అపురూప నిధి..11,000 క్యారెట్ల భారీ కెంపు, ధర
కిటికీ దగ్గర స్టీల్ చెంచా పెడితే ఇంట్లో ఆ సమస్య ఉండదా..!
కిటికీ దగ్గర స్టీల్ చెంచా పెడితే ఇంట్లో ఆ సమస్య ఉండదా..!
ఈ 5 మందిని అవమానిస్తే మీ పతనం మొదలవుతుంది!
ఈ 5 మందిని అవమానిస్తే మీ పతనం మొదలవుతుంది!
రైల్వేస్టేషన్‌లో ఓ ట్రైన్‌కు ప్లాట్‌ఫామ్ ఎలా నిర్ణయిస్తారో తెల్సా
రైల్వేస్టేషన్‌లో ఓ ట్రైన్‌కు ప్లాట్‌ఫామ్ ఎలా నిర్ణయిస్తారో తెల్సా
భోజనానికి ముందు చిన్న అల్లం ముక్క తిన్నారంటే అద్దిరిపోయే లాభాలు..
భోజనానికి ముందు చిన్న అల్లం ముక్క తిన్నారంటే అద్దిరిపోయే లాభాలు..
ఈ లక్షణాలు ఉన్న పురుషుడు ఎప్పటికీ మిమ్మల్ని వదిలిపెట్టడు!
ఈ లక్షణాలు ఉన్న పురుషుడు ఎప్పటికీ మిమ్మల్ని వదిలిపెట్టడు!
అతడు కాలేజీలో నా బెస్ట్ ఫ్రెండ్.. త్రిష..
అతడు కాలేజీలో నా బెస్ట్ ఫ్రెండ్.. త్రిష..
రావణుడి కుమార్తెను విదేశాలలో అదృష్ట దేవతగా ఎందుకు పూజిస్తారు?
రావణుడి కుమార్తెను విదేశాలలో అదృష్ట దేవతగా ఎందుకు పూజిస్తారు?
ఇండియాలోని ఈ 5 ప్రదేశాలు చూస్తే యూరప్‌కి వెళ్లినట్టే ఉంటుంది..
ఇండియాలోని ఈ 5 ప్రదేశాలు చూస్తే యూరప్‌కి వెళ్లినట్టే ఉంటుంది..