Telangana: తల తెగినా బీజేపీకి సపోర్ట్ చేయను.. హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు
మలక్‌పేట, మల్లేపల్లి, చంచల్‌గూడ వంటి ఐదు ప్రాంతాల్లో వక్ఫ్ భూములు కబ్జా చేసి, కాలేజీలు కట్టారని ఆరోపించారు. వాటిపై కేసులు నమోదైనట్లు చెప్పారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ పాలనలో ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. స్వరాష్ట్రం సాధించిన తర్వాత వక్ఫ్ భూములను కాపాడేందుకు కేసీఆర్ 22/ఏ జీవోను తీసుకొచ్చి, భూముల పరిరక్షణకు అండగా నిలిచారని చెప్పారు. ధరణితో కూడా వక్ఫ్...

తన తల తెగిపడినా బీజేపీకి సపోర్టు చేయబోనని హోం మంత్రి మహమూద్ అలీ చెప్పారు. నిన్నమొన్నటి వరకు బీఆర్‌ఎస్ ఉండి.. ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల పంచన చేరి, మైనార్టీ వర్గాన్ని దేవుడిలా కాపాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆరోపణలు చేయడం వారి సైతాన్ రాజకీయాలకు నిదర్శనం అని చెప్పారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ పాలనలోనే వక్ఫ్ భూములు ఆక్రమణకు గురయ్యాయని ఆరోపిస్తున్న మహబూబ్ అలం పెద్ద కబ్జాకోరు అని విమర్శించారు.
మలక్‌పేట, మల్లేపల్లి, చంచల్‌గూడ వంటి ఐదు ప్రాంతాల్లో వక్ఫ్ భూములు కబ్జా చేసి, కాలేజీలు కట్టారని ఆరోపించారు. వాటిపై కేసులు నమోదైనట్లు చెప్పారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ పాలనలో ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. స్వరాష్ట్రం సాధించిన తర్వాత వక్ఫ్ భూములను కాపాడేందుకు కేసీఆర్ 22/ఏ జీవోను తీసుకొచ్చి, భూముల పరిరక్షణకు అండగా నిలిచారని చెప్పారు. ధరణితో కూడా వక్ఫ్ భూములకు రక్షణ దొరికిందని చెప్పారు. మోసకారి అయిన రేవంత్‌రెడ్డి మాటలు విని.. బీఆర్‌ఎస్‌పై ఆరోపణలు చేయడం వారి సిగ్గుమాలిన తనానికి నిదర్శనం అన్నారు.
రేవంత్ గెలిచింది లేదు.. సచ్చిం లేదు.. అతను ఇస్తానన్న ఎమ్మెల్సీలకు ఆశపడి బీఆర్‌ఎస్ పార్టీపై నిందలు వేస్తే సహించేది లేదన్నారు. మహబూబ్ అలం లాంటి 50 మంది ముస్లిం వ్యక్తులకు ఎమ్మెల్సీ ఇస్తానని ఆశ చూపారని, ఎక్కడ మీటింగ్‌కు వెళ్లినా.. అక్కడి ముస్లిం నేతలకు ఎమ్మెల్సీలు ఇస్తానని రేవంత్‌రెడ్డి దొంగ హామీలు ఇస్తున్నట్లు హోమంత్రి మహమూద్ అలీ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్‌రెడ్డి రాకతో సంఘ్ పరివార్ చేతుల్లోకి వెళ్లిందని మహమూద్ అలీ అన్నారు.
బీఆర్‌ఎస్ పాలనలోనే ముస్లింలకు రక్షణ..
స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ బాధ్యతలు తీసుకున్న దగ్గర్నుంచి ఒక్క చిన్న మత ఘర్షణ కూడా జరగలేదని మహమూద్ అలీ చెప్పారు. తెలంగాణ గంగా జమునా తెహ్‌జీబ్‌గా వర్ధిల్లుతున్నదని అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీలోనే ఎక్కువ మంది ఎమ్మెల్సీలు ఉన్నారని చెప్పారు. ముస్లిం మైనార్టీల్లోని అందరి కోసం షాదీముబారక్ తీసుకొచ్చి వేలాది మంది పేద బిడ్డల పెళ్లిళ్లు చేశారన్నారు. వీటితోపాటుగా ఆసరా పింఛన్లు, ఇమామ్, మౌజాంలకు వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. వీటితోపాటు ముస్లి రైతులకు సైతం రైతుబంధు, రైతు బీమా ఇచ్చి ధీమా పెంచినట్లు మహమూద్ అలీ చెప్పారు.
నేటికీ కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ముస్లింలపై అనేక దాడులు జరుగుతున్నట్లు చెప్పారు. తెలంగాణలో ముస్లింల కోసం రూ.500 కోట్లతో అద్భుతమైన దర్గాను నిర్మించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చెప్పారు. మన దేశంలో కేసీఆర్ కంటే ఎక్కువగా ముస్లింలకు మేలు చేసిన ఒక్క నాయకుడ్ని చూపించాలని మహమూద్ అలీ సవాల్ విసిరారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్, ఎంఐఎంలు మంచి స్నేహితులు మాత్రమేనని, కూటమి మాత్రం కాదని తేల్చి చెప్పారు. ఇకనైనా ముస్లిం మైనార్టీ సోదరులు 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనను, 9 ఏండ్ల ఏండ్ల బీఆర్‌ఎస్ పాలనను చూసి, ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
