AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Potholes: ఓ వైపు ప్రాణాలు పోతుంటే రోడ్లు రిపేర్ చేయడానికి ఎన్ని దశాబ్దాలు కావాలి.. అధికారులకు హైకోర్టు ప్రశ్న

Hyderabad Potholes: రైల్వే విశ్రాంత ఉద్యోగి గంగాధర్ తిలక్ దంపతులు తమ పింఛను డబ్బుతో హైదరాబాద్ లోని రోడ్డు మీద గుంతలు పూడ్చటంపై  హైకోర్టు విచారణ చేపట్టిన..

Hyderabad Potholes: ఓ వైపు ప్రాణాలు పోతుంటే రోడ్లు రిపేర్ చేయడానికి ఎన్ని దశాబ్దాలు కావాలి.. అధికారులకు హైకోర్టు ప్రశ్న
Hyderabad Potholes
Surya Kala
| Edited By: Janardhan Veluru|

Updated on: Jul 20, 2021 | 5:50 PM

Share

Hyderabad Potholes: రైల్వే విశ్రాంత ఉద్యోగి గంగాధర్ తిలక్ దంపతులు తమ పింఛను డబ్బుతో హైదరాబాద్ లోని రోడ్డు మీద గుంతలు పూడ్చటంపై  హైకోర్టు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే.. ఈ నేపధ్యంలో ఈరోజు జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లపై గుంతలకు సంబంధించి .. జీహెచ్ఎంసీ అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. భాగ్యనగరంలోని రోడ్లు పరిస్థితిపై ఇచ్చిన నివేదికలో నగరంలోని 9,013 కి.మీ. రోడ్లు ఉండగా.. వాటిల్లో 6వేల కి.మీ. పైగా సిమెంట్ రోడ్లు వేశామని చెప్పారు.

ఆ నివేదికను పరిశీలించిన హైకోర్టు.. నగరంలో రోడ్ల మరమ్మతులు పూర్తి చేసేందుకు ఎన్ని దశాబ్దాలు కావాలంటూ అధికారులను ప్రశ్నించింది. ప్రజలు ప్రాణాలు పోతుంటే.. రోడ్లను మరమ్మత్తులను చేయడానికి దశాబ్దాలు కావాలంటూ ప్రశ్నించింది. హైకోర్టు వ్యాఖ్యపై స్పందించిన జీహెచ్ఎంసీ అధికారులు వర్షాకాలంలో గుంతల పూడ్చివేత పనులు రోజూ జరుగుతున్నాయని.. అందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అంతేకాదు హైదరాబాద్ నగర పరిధిలో సమీకృత రహదారి అభివృద్ధి కార్యక్రమం అమలు చేస్తున్నాంని తెలిపారు.

దీంతో వర్షాకాలం నీళ్లు నిలిచే ప్రాంతాలను గుర్తించి సరిచేయాలని.. వరద నీటి కాలువలు, రోడ్ల మరమ్మతులు పెంచాలని హైకోర్టు జీహెచ్ఎంసీ ని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శంగా నిలచేలా హైదరాబాడ్ నగర రోడ్లు ఉండలని సూచించింది. హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయంగా పేరున్న నేపథ్యంలో ఇక్కడ రోడ్లు వంటి ప్రాధమిక సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి అవసరమని తెలిపింది.. అంతేకాదు వసతులు బాగుంటేనే పెట్టబడులు వస్తాయని.. మరో రెండు వారాల్లో నగరంలోని రహదారుల అభివృద్ధిపై నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Also Read: Amitabh Gifted A Car: గత 10 ఏళ్ల నుంచి రోడ్డుమీద గుంతలను పూడుస్తున్న వృద్ధ జంట.. కారు గిఫ్ట్ ఇచ్చిన అమితాబ్