తెలంగాణలో భూముల మార్కెట్ విలువ పెంపు.. జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎప్పటినుంచంటే.!

తెలంగాణలో భూముల విలువను పెంచుతూ కేసీఆర్ సర్కార్ తాజాగా జీవో జారీ చేసింది.

తెలంగాణలో భూముల మార్కెట్ విలువ పెంపు.. జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎప్పటినుంచంటే.!
Telangana Lands
Follow us

|

Updated on: Jul 21, 2021 | 6:51 AM

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా భూముల మార్కెట్ విలువను పెంచుతూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ జీవో నెంబర్ 58ని విడుదల చేశారు. ఎల్లుండి అనగా జూలై 22వ తేదీ నుంచి భూముల కొత్త ధరలు అమలులోకి రానున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కాగా, ఇటీవల జరిగిన కేబినేట్ సమావేశంలో భూముల ధరలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ల్యాండ్ మార్కెట్ విలువ పెరిగితే రాష్ట్ర ఖజానా నిండుకోవడమే కాకుండా రియల్ ఎస్టేట్‌లో బ్లాక్ దందాకు కూడా చెక్ పడుతుంది. దీనితో కేసీఆర్ సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భూముల విలువ ప్రాంతాల వారీగా పెరగ్గా.. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తులు మార్కెట్ విలువలు కూడా పెరిగాయి. అలాగే శ్లాబుల వారీగా మార్కెట్ విలువను ప్రభుత్వం ఫిక్స్ చేసింది. ఇక పెరిగిన ధరలపై ఓ లుక్కేస్తే.!

వ్యవసాయ భూములకు అత్యల్ప విలువను ఎకరానికి రూ. 75,000గా నిర్ణయించారు. అలాగే ప్రస్తుతం వ్యవసాయ భూముల రేట్లు.. కనిష్టంగా 30 శాతం, గరిష్టంగా 50 శాతం పెరిగాయి. అదే విధంగా, ఓపెన్ ప్లాట్ల విషయానికి వస్తే.. కనిష్ట విలువ ఒక చదరపు గజానికి రూ. 200గా నిర్ణయించింది. అటు ఓపెన్ ప్లాట్లు కూడా కనిష్టంగా 30 శాతం, గరిష్టంగా 50 శాతం పెరిగాయి. ప్రస్తుతం ఫ్లాట్లు, అపార్ట్‌మెంట్లకు సంబంధించి కనిష్ట విలువ ఒక చదరపు అడుగును రూ.1000కు పెంచింది. అటు ఫ్లాట్లు, అపార్టుమెంట్‌లు కనిష్టంగా 20 శాతం, గరిష్టంగా 30 శాతం పెరిగాయి. అటు రిజిస్ట్రేషన్ ఛార్జీలను 6 నుంచి 7.5 శాతానికి పెంచారు.

కాగా, ఆర్ధిక మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలోని కేబినేట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక నేపధ్యంలో భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుకు తాజాగా కేబినేట్ ఆమోదముద్ర వేసిన విషయం విదితమే. భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఈ నెల 22వ తేదీ నుంచి అమలులోకి వచ్చేలా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తగిన ఏర్పాట్లు చేస్తోంది.

Also Read

ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. చెట్టుపై 11 అడుగుల భారీ పాము.. షాకైన స్థానికులు..

కొంచెం థ్రిల్.. మరికొంచెం ఆత్రుత.. ఈ ఫోటోలో పాము దాగుంది.. దాన్ని కనిపెట్టండి చూద్దాం.!

37 నిమిషాల బ్యాటింగ్.. 453 స్ట్రైక్ రేట్‌‌తో తుఫాన్ ఇన్నింగ్స్.. ఆ బ్యాట్స్‌మెన్ ఎవరంటే.!

ఈ ఫోటోలో చిన్నారి ఇప్పుడొక స్టార్ హీరోయిన్.. టాలీవుడ్‌ను ఏలుతోంది.. ఈమెవరో గుర్తుపట్టారా!

1

Latest Articles
Horoscope Today: సమాజంలో ఆ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది..
Horoscope Today: సమాజంలో ఆ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది..
డూ ఆర్ డై మ్యాచ్‌లో పంజాబ్‌పై ఆర్సీబీ విజయం.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం
డూ ఆర్ డై మ్యాచ్‌లో పంజాబ్‌పై ఆర్సీబీ విజయం.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం
T20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు.. కెప్టెన్ ఎవరో అసలు ఊహించలేరు
T20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు.. కెప్టెన్ ఎవరో అసలు ఊహించలేరు
ఒకే గడ్డపై ఇద్దరు అగ్ర నేతలు.. ఏం మాట్లాడతారన్న సర్వత్రా ఆసక్తి!
ఒకే గడ్డపై ఇద్దరు అగ్ర నేతలు.. ఏం మాట్లాడతారన్న సర్వత్రా ఆసక్తి!
బీఆర్ఎస్ నామమాత్రంగా పోటీః రేవంత్
బీఆర్ఎస్ నామమాత్రంగా పోటీః రేవంత్
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
కోహ్లీ సెంచరీ మిస్.. పటిదార్ మెరుపులు.. RCB భారీ స్కోరు
కోహ్లీ సెంచరీ మిస్.. పటిదార్ మెరుపులు.. RCB భారీ స్కోరు
పిండి రుబ్బకుండానే.. జస్ట్ పది నిమిషాల్లో గారెలు చేయొచ్చు..
పిండి రుబ్బకుండానే.. జస్ట్ పది నిమిషాల్లో గారెలు చేయొచ్చు..
తిరుగులేని టీమిండియా..బంగ్లాను క్లీన్‌స్వీప్ చేసిన భారత అమ్మాయిలు
తిరుగులేని టీమిండియా..బంగ్లాను క్లీన్‌స్వీప్ చేసిన భారత అమ్మాయిలు
నవనీత్‌ కౌర్‌ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలి.. సీఎం రేవంత్
నవనీత్‌ కౌర్‌ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలి.. సీఎం రేవంత్