Etela : ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులకు హైకోర్టులో చుక్కెదురు, జమున హేచరీస్ భూముల్లో సర్వే నిలుపుదలకు ధర్మాసనం నో

Etela Rajender తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది...

Etela : ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులకు హైకోర్టులో చుక్కెదురు, జమున హేచరీస్ భూముల్లో సర్వే నిలుపుదలకు ధర్మాసనం నో
Etela Rajender
Follow us
Venkata Narayana

|

Updated on: May 27, 2021 | 10:49 PM

Etela Rajender తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తమకు చెందిన జమున హ్యాచరీస్ భూముల్లో సర్వే నిలుపుదల చేయాలంటూ ఈటల అర్ధాంగి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈమేరకు ఈటల భార్య జమున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆమె పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. ప్రభుత్వం జారీ చేసిన సర్వే నోటీసులపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. సర్వే నోటీసులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన న్యాయస్థానం జూన్ 2 లేదా మూడో వారంలో సర్వే చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. ఇలా ఉండగా, ఈటల భూములు సర్వే చేసేందుకు తూప్రాన్ డివిజన్ డిప్యూటీ సర్వే ఇన్ స్పెక్టర్ ఈనెల 6న నోటీసులు ఇచ్చారు. నోటీసులను సవాల్ చేస్తూ జమున దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టు వేసవి ప్రత్యేక కోర్టులో న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టారు. అత్యవసరంగా సర్వే చేయాల్సిన అవసరం ఏమిటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

అసైన్ మెంట్ భూములను తేల్చడానికి సర్వే చేసేందుకే జమున హాచరీస్ తో పాటు గ్రామంలోని భూయజమానులందరికీ నోటీసులు ఇచ్చినట్లు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు. సర్వే కోసం ముందస్తు నోటీసు ఇస్తే తప్పేంటని పిటిషనర్​ను హైకోర్టు ప్రశ్నించింది. ఇరు వైపులా వాదనలు విన్న న్యాయస్థానం జమున హాచరీస్ భూముల్లో సర్వే నిలిపివేతకు హైకోర్టు నిరాకరించింది.

Read also : RRR : ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు, చికిత్స అనంతరం ఢిల్లీలోని తన అధికారిక నివాసానికి చేరుకున్న రఘురామరాజు

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?