Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR : ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు, చికిత్స అనంతరం ఢిల్లీలోని తన అధికారిక నివాసానికి చేరుకున్న రఘురామరాజు

MP Raghu ramakrishna raju : ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు చికిత్స అనంతరం..

RRR : ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు, చికిత్స అనంతరం ఢిల్లీలోని తన అధికారిక నివాసానికి చేరుకున్న రఘురామరాజు
Raghu Rama Krishna Raju
Follow us
Venkata Narayana

|

Updated on: May 27, 2021 | 10:24 PM

MP Raghu ramakrishna raju : ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు చికిత్స అనంతరం హస్తినలోని తన అధికారిక నివాసానికి చేరుకున్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ ఏపీ సీఐడీ పోలీసులు ఎంపీని అరెస్ట్ చేయడం.. తదనంతర పరిణామాల్లో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రఘురామరాజు బెయిల్ పై విడుదలవడం తెలిసిందే. బెయిల్ పై విడుదలైన రఘురామ ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఈ రోజు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయన కాళ్లలో కణజాలం దెబ్బతిన్నట్టు వైద్య పరీక్షల్లో వెల్లడైనట్టు తెలుస్తోంది. రఘురామ రెండు కాళ్లకు కట్లు కట్టిన ఎయిమ్స్ డాక్టర్లు రెండు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి అయిన అనంతరం ఢిల్లీలోని తన నివాసానికి చేరుకున్నారు రఘురామకృష్ణరాజు.

Read also : Baton gang : అర్థరాత్రి వేళ కనిపించిన వారిని కనిపించినట్టు బాదుతున్న లాఠీ గ్యాంగ్‌లో నలుగురు అరెస్ట్