Vanama Venkateshwara Rao: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. ఎమ్మెల్యే వనమాపై అనర్హత వేటు..

Vanama Venkateshwara Rao: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావుపై అనర్హత వేటు వేసింది.

Vanama Venkateshwara Rao: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. ఎమ్మెల్యే వనమాపై అనర్హత వేటు..
Vanama Venkateshwara Rao
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 25, 2023 | 12:24 PM

Vanama Venkateshwara Rao: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేసింది. ఎమ్మెల్యేగా వనమా ఎన్నిక చెల్లదని స్పష్టంచేసింది. దీంతోపాటు కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావ్ ను ప్రకటించింది. ఎన్నికలవేళ తప్పుడు అఫిడవిట్‌ సమర్పించినట్లు నిర్దారించిన.. ధర్మాసనం రూ.5లక్షలు జరిమానా విధించింది. అయితే, ఎన్నికలప్పుడు అఫిడవిట్‌లో సమర్పించిన కేసులు, ఆస్తులు అబద్దాలని తేల్చింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన వనమా..ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పట్లో బీఆర్‌ఎస్‌ తరఫున పోటీచేసిన జలగం వెంకట్రావు.. వనమా అఫిడవిట్‌పై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. జలగం వెంకట్రావు పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. ఈసీకి తప్పుడు సమాచారం ఇచ్చిన వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని.. తీర్పునిచ్చింది.

వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేకు అనర్హుడని.. 2018 డిసెంబర్ 12 నుంచి సమీప అభ్యర్థి జలగం వెంకట్రావు ను ఎమ్మెల్యే గా గుర్తించాలని తెలంగాణ ధర్మాసనం తీర్పులో వెలువరించింది. వనమా వెంకటేశ్వరరావు తన భార్య పేరు ఉన్న ఆస్తులను ప్రకటించకపోవడంతో జలగం వెంకట్రావు కోర్టు ఆశ్రయించారు. ఎన్నికల అఫిడవిట్ తో పాటు సమర్పించాల్సిన ఫామ్ 26 కు సంబందించిన వివరాలను వనమా సమర్పించలేదు. భార్య పేరు మీద ఉన్న ఆస్తులు అఫిడవిట్లో ఉన్న వనమా మెన్షన్ చెయ్యలేదు. కాగా.. వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయగా.. బీఆర్ఎస్ నుంచి జలగం వెంకట్రావు పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?