AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

High Court: ఎన్నికలు ఎప్పుడు పెడతారు.. తెలంగాణ ప్రభుత్వం, ఈసీకి హైకోర్టు సూటి ప్రశ్న

స్థానిక సంస్థ‌ల‌కు సంబంధించి రీ నోటిఫికేష‌న్ ఇవ్వాలంటూ న్యాయ‌వాది సురేందర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ఈసీని ప్రశ్నించింది. ప్రభుత్వంతో చర్చించాకే రీ నోటిఫికేషన్ ఉంటుందని ఇందుకు రెండు వారాల సమయం కావాలని ఈసీ కోరింది.

High Court: ఎన్నికలు ఎప్పుడు పెడతారు..  తెలంగాణ ప్రభుత్వం, ఈసీకి హైకోర్టు సూటి ప్రశ్న
Tg High Court
Anand T
|

Updated on: Oct 17, 2025 | 1:22 PM

Share

తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన స్థానిక సంస్థల ఎన్నికలపై దాఖలైన మరో పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. స్థానిక సంస్థల ఎన్నికలకు రీ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని సురేందర్ అనే న్యాయవాధి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇక పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యల చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టు కూడా ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని తెలిపినట్టు ఈసీకి కోర్టు గుర్తుచేసింది.

ఎన్నికలు పెట్టుకోవచ్చు అని సుప్రీం కోర్టు చెప్పింది కానీ.. కోర్టు ఆర్డర్స్‌ కాపీ మాత్రం ఎక్కడా లేదని ఈసీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. కానీ బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ నోటిఫికేషన్ ఇచ్చాం కాబట్టే దాన్ని సస్పెండ్ చేశామని.. ఈ విషయంపై గురువారమే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని ఈసీ తరపు న్యాయవాది తెలిపారు. ప్ర‌భుత్వంతో చర్చించిన త‌ర‌వాతే రీ నోటిఫికేష‌న్ ఉంటుంద‌ని.. ఇందుకోసం తమకు రెండు వారాల సమయం కావాలని ఈసీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈసీ తరపు న్యాయవాది ప్రతిపాదనకు అంగీకరించిన న్యాయస్థానం ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను రెండు వారాలకు వాయుదా వేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బీరువా నుంచి బయటకొచ్చిన బాస్‌‎లు..రోహిత్-విరాట్ సర్ప్రైజ్ ఎంట్రీ
బీరువా నుంచి బయటకొచ్చిన బాస్‌‎లు..రోహిత్-విరాట్ సర్ప్రైజ్ ఎంట్రీ
వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ సంచలన పోస్ట్
వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ సంచలన పోస్ట్
ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? ఎక్కడెక్కడో తెలుసా?
ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? ఎక్కడెక్కడో తెలుసా?
ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది
ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది
సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ
సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ
తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.
తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్