AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: రెంటర్స్ బీకేర్ ఫుల్‌.. అద్దె ఇంటి బాత్‌రూమ్‌లో సీక్రెట్‌ కెమెరా.. పెట్టింది ఎవరో తెలిస్తే..

హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ అద్దె ఇంట్లో యజమాని సీక్రెట్ కెమెరాలను అమర్చాడు. ఇటీవల బాత్‌రూమ్‌లోని బల్బు హోల్డర్‌లో దాచిన సీక్రెట్‌ కెమెరాలను గుర్తించిన బాధిత కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఓనర్‌ భాగోతం బయటపడింది.ఈ ఘటన హైదరాబాద్‌ నగరంలోని మధురానగర్‌లో చోటుచేసుకోగా ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Video: రెంటర్స్ బీకేర్ ఫుల్‌.. అద్దె ఇంటి బాత్‌రూమ్‌లో సీక్రెట్‌ కెమెరా.. పెట్టింది ఎవరో తెలిస్తే..
Hyderabad Secret Camera
Anand T
|

Updated on: Oct 17, 2025 | 11:52 AM

Share

బతుకు జీవుడా అని వచ్చే ప్రతి ఒక్కరికి భాగ్యనగరం ఆశ్రయం ఇస్తుంది. విద్యా, ఉద్యోగం కోసమని ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి అద్దె ఇళ్లు, హాస్టల్స్‌లో చాలా మంది నివాసం ఉంటున్నారు. కానీ ఇటీవల కొందరి ఇంటి యజమానులు వ్యవహరిస్తున్న తీరుతో జనాలు అద్దె ఇళ్లలో ఉండాలంటేనే భయపడిపోతున్నారు. ఇందుకు తాజాగా మధురానగర్‌లోని జవహర్ నగర్‌లో వెలుగు చూసిన ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. ఒక అద్దె ఇంట్లోని బాత్‌రూమ్‌లో సీక్రెట్‌ కెమెరాలను అమర్చి వారి ప్రైవేట్‌ ఫోటోలు, వీడియోలు చిత్రీకరించే ప్రయత్నం చేశాడు ఒక యజమానికి. గమనించిన బాధిత కుటుంబ సభ్యులు పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహార్‌ నగర్‌లోని అశోక్ యాదవ్ అనే వ్యక్తి ఇంట్లో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్న ఒక జంట అద్దెకు ఉంటుంది. అయితే ఈ నెల 4న వాళ్ల ఇంట్లోని బాత్‌రూమ్‌ బల్బ్ పనిచేయకపోవడంతో ఇంటి యజమానికి ఆ విషయం చెప్పారు. దీంతో యజమనాకి ఓ ఎలక్ట్రీషియన్‌ను పిలిపించి కొత్త బల్బ్‌ను పెట్టించాడు. అప్పుడు బల్బ్‌తో పాటు దానిలో సీక్రెట్ కెమెరా కూడా ఏర్పాటు చేయించాడు. దీనితో ఆ ఇంట్లో ఉంటున్న వివాహిత స్నానం చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించాడు.

అయితే ఈ నెల 13న బాత్రూమ్‌లో ఉన్న బల్బ్ హోల్డర్ స్క్రూ ఊడిపోవడంతో చూడమని ఆ మహిళ తన భర్తకు చెప్పింది. దీంతో హోల్డర్ విప్పి చూసిన భర్త అందులో ఉన్న సీక్రెట్‌ కెమెరాను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే ఈ విషయాన్ని ఓనర్‌ దృష్టికి తీసుకెళ్లాడు. బల్బ్‌ ఫిట్‌ చేయడానికి వచ్చిర ఎలక్ట్రీషియన్ ఈ పని చేసి ఉంటాడని అతన్ని పిలవాలని చెప్పాడు. అయితే యజమాని మాత్రం వారి మాటలను పట్టించుకోలేదు. దీంతో ఆ జంట పోలీసులను ఆశ్రయించింది. బాధితుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు సంచలన విషయాలను తెలుసుకున్నారు.

ఇంటి యజమాని అశోకే బాత్‌రూమ్‌లో ఎలక్ట్రీషియన్‌తో కెమెరాను ఏర్పాటు చేయించాడని తెలుసుకొని అతన్ని అరెస్ట్ చేశారు. ఇక ఎలక్ట్రీషియన్ చింటు పరారీలో ఉన్నట్టు తెలుసుకొని అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు హాస్టల్స్, హోటల్స్‌లో మాత్రమే ఇలాంటి ఘటనలు వెలుగు చూడగా ఇప్పుడు అద్దె ఇళ్లలో కూడా జనాలకు రక్షణ లేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా