Telangana Weather: తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు.. ప్రజలంతా బీ అలెర్ట్

వెదర్ డిపార్ట్‌మెంట్ నుంచి అలెర్ట్ వచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Telangana Weather: తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు.. ప్రజలంతా బీ అలెర్ట్
Telangana Rains
Follow us

|

Updated on: Sep 28, 2022 | 5:50 PM

ఉన్నట్టుండి మబ్బు నల్లగా మారుతుంది. అప్పటికప్పుడే మేఘాలు వచ్చేస్తున్నాయి. వాన ప్రారంభమై.. జడివానగా మారతుంది. అక్కడా.. ఇక్కడా అని లేదు.. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో సేమ్ సీన్. హైదరాబాద్‌లో అయితే పరిస్థితి ఇంకా దారుణం. ఏంటో బాకీ ఉన్నట్లు సాయంకాలం వరుణుడు విరుచుకుపడుతున్నాడు. దీంతో కాలేజీలు, ఆఫీసుల నుంచి వచ్చేవాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ కష్టాలు అయితే వర్ణణాతీతం. లోతట్టు ప్రాంతాల్లో అయితే సిట్యువేషన్ మరీ వరెస్ట్. మోకాళ్లోతు నీళ్లు నిలబడుతున్నాయి. తాజాగా మరోసారి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వెదర్ డిపార్ట్‌మెంట్. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వచ్చే కొన్ని గంటల పాటు ఉరుములు, మెరుపులతో వర్షం దంచికొట్టే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అధికారులు కూడా పరిస్థితులను మోనిటరింగ్ చేయాలని కోరింది.  పొలాల్లోని రైతులు, రైతు కూలీలు వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండవద్దని వాతావరణ శాఖ అధికారులు కోరారు. లోతట్టు ప్రాంతాల్లో నివశిస్తున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు.

నగరంలో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉన్న  నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు, జీహెచ్‌ఎంసీ టీమ్స్  అలర్ట్ అయ్యాయి.  అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావద్దని సూచించారు. ప్రైమ్ టైమ్ కావడంతో ట్రాఫిక్ కష్టాల్లో చిక్కుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. కాగా షియర్ జోన్ ప్రభావంతో పలు జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

రాష్ట్రంలోని చాలా చోట్ల ఓ మోస్తరు వర్ష పాతం నమోదవ్వచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో విపత్తు నిర్వహణ బృందాలు అలెర్ట్ అయ్యాయి. అత్యవసర సాయం కోసం 040-29555500 నంబర్‌కు కాల్ చేయాలని అధికారులు ప్రజలకు సూచించారు. ఎమర్జెన్సీ అయితే 100 నంబర్‌కు డయల్ చేయాలని పోలీసులు ప్రకటన విడుదల చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..