Lockdown In Telangana: మరోమారు లాక్‌డౌన్‌పై స్పష్టతనిచ్చిన ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్
తెలంగాణలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. రికార్డు స్థాయిలో రోజుకు వేల కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరోమారు లాక్‌డౌన్ పక్కా అనే...
తెలంగాణలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. రికార్డు స్థాయిలో రోజుకు వేల కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరోమారు లాక్‌డౌన్ పక్కా అనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో మరోమారు లాక్‌డౌన్ పెట్టే ఆలోచన లేదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
ఏప్రిల్ 30 నుంచి 19 జిల్లాల్లో డయాగ్నొస్టిక్ హబ్‌లు ప్రారంభిస్తామని ఈటల చెప్పారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి జిల్లా డయాగ్నొస్టిక్ కేంద్రాల్లో రక్త పరీక్షలు నిర్వహిస్తామన్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు 3, 4 రోజులకు ఒకసారి రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఔషధాలు, ఆక్సిజన్ ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఈటల హెచ్చరించారు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన రోగులకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు.
కేంద్రం కేటాయించే వ్యాక్సిన్లను బట్టి రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. టీకాలు వచ్చే పరిస్థితిని బట్టి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. 3.5 కోట్ల టీకాలు 3 నెలల్లో ఇవ్వాలని అనుకుంటున్నాం. దిగుమతి చేసుకునేందుకు కేంద్రం అనుమతి ఇస్తుందా? అని ప్రశ్నించారు. ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి టీకా వేసే అవకాశం ఉంది. టీకా, కొవిడ్ పరీక్షలు వేర్వేరు కేంద్రాల్లో ఉండాలన్న వాదన కూడా ఉందన్నారు. దీనిపై ఆలోచిస్తామన్నారు. వ్యాక్సిన్ల కోసం పకడ్బందీగా కార్యాచరణ రూపొందిస్తామని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
Also Read: కరోనాపై సోషల్ మీడియాలో ప్రచారాలు.. వాస్తవాలపై క్లారిటీ ఇచ్చిన డబ్ల్యూహెచ్‌వో