AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మహిళా సంఘాలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ఇది కదా కావాల్సింది..

మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా బస్సులు కొనుగోలు చేయించి.. వాటిని ఆర్టీసీకి అద్దెకిచ్చేలా కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రయోగాత్మకంగా రెండు జిల్లాల్లో మహిళ సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించాలని డిసైడ్‌ అయింది.

Telangana: మహిళా సంఘాలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ఇది కదా కావాల్సింది..
Telangana News
Ram Naramaneni
|

Updated on: Oct 08, 2024 | 9:24 PM

Share

మ‌హిళా సంఘాల‌ను ఆర్థికంగా బ‌లోపేతం చేసే దిశ‌లో తెలంగాణ ప్రభుత్వం మ‌రో అడుగు ముందుకు వేసింది. మ‌హిళా స్వయం సహాయ‌క సంఘాల‌కు బ్యాంకు రుణాలు ఇప్పించి వారి ద్వారా బ‌స్సుల‌ను ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా బ‌స్సుల సంఖ్య పెంచాల‌ని డిమాండ్ వ‌స్తున్న నేప‌థ్యంలో.. మ‌హిళా సంఘాల‌కు ఉపాధి క‌ల్పిస్తూ వారి ద్వారా కొనుగోలు చేసిన బ‌స్సుల‌ను హైర్ చేసుకోవాల‌ని ఆర్డీసీ నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా రెండు జిల్లాల్లో మ‌హిళా సంఘాల‌కు ఆర్టీసీ అద్దె బ‌స్సుల‌ను కేటాయించాల‌ని ఫిక్స్‌ అయింది.

తాజాగా.. స‌చివాల‌యంలో ర‌వాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌ మంత్రి సీత‌క్క ఆధ్వర్యంలో స‌మావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ర‌వాణా శాఖ‌, పంచాయితీరాజ్‌ శాఖల ఉన్నతాధికారులు పాల్గొనగా.. మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సుల కేటాయింపు విధివిధానాల‌పై చ‌ర్చించారు. మొద‌టి విడ‌త‌లో ప్రయోగాత్మకంగా రెండు జిల్లాల్లోని మ‌హిళా సంఘాల‌కు ఆర్టీసీ అద్దె బ‌స్సుల‌ను కేటాయించాల‌ని నిర్ణయించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా మ‌హబూబ్‌న‌గ‌ర్, ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాక‌ర్ సొంత జిల్లా క‌రీంన‌గ‌ర్‌ల‌ను ఎంపిక చేశారు. మొద‌టి విడ‌త‌లో 100 నుంచి 150 బ‌స్సుల‌ను మ‌హిళా సంఘాల ద్వారా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మ‌హిళా సంఘాలు కొనుగోలు చేసే ఆర్టీసీ అద్దె బ‌స్సుల నిర్వహ‌ణ బాధ్యత‌ల కోసం ప్రత్యేక వ్యవ‌స్థను ఏర్పాటు చేయాల‌ని డిసైడ్‌ అయ్యారు. ఇక.. ఆర్టీసీ బ‌స్సుల కొనుగోలుకు అయ్యే ఖ‌ర్చు, వ‌చ్చే ఆదాయం, నిర్వహ‌ణ ఖ‌ర్చు లాంటి అంశాల‌న్నింటితో కూడిన స‌మ‌గ్ర నివేదిక‌ సమర్పించిన త‌ర్వాత తెలంగాణ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.   

అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే