Telangana: ఇప్పటి నుంచి 10 గంటలు.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
ఉద్యోగుల పనివేళల్లో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు 8 గంటలుగా ఉన్న పనివేళలను పొడిగించింది. దానిని 10గంటలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వారానికి 48గంటలు మించొద్దని వ్యాపార సంస్థలకు సూచించింది. ఒకవేళ మించితే ఓటీ కట్టివ్వాలని చెప్పింది.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపార సంస్థల్లో ఉద్యోగుల పనివేళలను పెంచింది. ఇప్పటివరకు ఇది 8 గంటలుగా ఉండేది. ఇక నుంచి ఇది మారనుంది. ఉద్యోగుల పనివేళలను 10 గంటలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వారంలో 48గంటల పని మించకూడదని తెలిపింది. ఒకవేళ 48గంటలు దాటితే తప్పనిసరిగా ఓటీ పైసలు కట్టివ్వాలని వ్యాపార సంస్థలను ఆదేశించింది. అంతేకాకుండా ఒక రోజులో 6గంటల్లో అరగంట రెస్ట్ ఇవ్వాలని చెప్పింది. విశ్రాంతితో కలుపుకుని 12గంటల కంటే ఎక్కువ పనిచేయించొద్దని హెచ్చరించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా ఉద్యోగు పనివేళలు సవరించినట్టలు ప్రభుత్వం తెలిపింది.
వ్యాపార సంస్థలనే కాకుండా ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో ఉద్యోగుల టైమింగ్స్‌కు సంబంధించి కఠిన రూల్స్ ఉండేవని.. దాంతో వ్యాపారస్థులకు ఇబ్బందిగా ఉండేదనే వాదనలున్నాయి. అయితే ప్రభుత్వం కొత్తగా తెచ్చిన సవరణలతో ఇరువర్గాలకు లాభం జరుగుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే ఏపీ సైతం మహిళల పనివేళలల్లో మార్పులు చేసింది. రాత్రిషిఫ్టుల్లోనూ మహిళలను పనికి అనుమతిస్తూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అక్కడ మహిళలు రాత్రి 7 తర్వాత.. 6కు ముందు కూడా పనిచేసుకోవచ్చు. అదేవిధంగా పనివేళలను 9గంటల నుంచి 10 గంటలకు పెంచింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..