AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indiramma Atmiya Bharosa: త్వరలో వారందరీ అకౌంట్లోకి రూ.6 వేలు.. ముహూర్తం ఫిక్స్ చేసిన తెలంగాణ సర్కార్

భూమి లేని రైతులు, రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇందుకోసం ముహూర్తం ఫిక్స్ అయింది. త్వరలోనే రైతు భరోసాతో పాటు వీటి నిధులను కూడా విడుదల చేయనున్నారు. రూ.6 వేలు విడుదల చేయనున్నారు.

Indiramma Atmiya Bharosa: త్వరలో వారందరీ అకౌంట్లోకి రూ.6 వేలు.. ముహూర్తం ఫిక్స్ చేసిన తెలంగాణ సర్కార్
Indiramma Atmiya Bharosa
Venkatrao Lella
|

Updated on: Jan 11, 2026 | 4:17 PM

Share

Indiramma Atmiya Bharosa Scheme: తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ భారీ శుభవార్త అందించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26 నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సంక్రాంతికే రైతు భరోసా నిధులు విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ.. కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. దీంతో జనవరి చివరి వారంలో రిలీజ్ చేసేందుకు సిద్దమవుతోంది. ప్రస్తుతం సాగులో ఉన్న భూములకు ఎకరానికి రూ.6 వేల చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది. అందరి రైతుల అకౌంట్లలో జమ చేయడానికి 10 రోజుల సమయం పట్టే అవకాశముంది. శాటిలైట్ సర్వే ఆధారంగా ప్రస్తుత యాసంగి సీజన్‌లో పంట సాగు చేస్తున్న భూములను ప్రభుత్వం గుర్తిస్తోంది. దీంతో పంట సాగు చేయని రైతులకు ఈ సారి రైతు భరోసా కట్ కానుందని తెలుస్తోంది.

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా..

ఇక రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను కూడా ప్రభుత్వం జమ చేయనుంది. ఈ పధకం ద్వారా భూమి లేని రైతులు, కౌలు రైతులు, రైతు కూలీల అకౌంట్లో రూ.6 వేల జమ చేయనుంది. రిపబ్లిక్ డే సందర్బంగా జనవరి 26న ఈ పధకం నిధులు వారి అకౌంట్లో జమ చేయనుందని తెలుస్తోంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ప్రతీ ఏటా రూ.12 వేలు ప్రభుత్వం అందిస్తోంది. రెండు విడతలుగా రూ.6 వేల చొప్పున ఇస్తోంది. ఈ పథకం వల్ల వ్యవసాయంపై ఆధారపడ్డ రైతు కూలీలతో పాటు కౌలు రైతులకు లబ్ది చేకూరనుంది. గత ఏడాది ఈ పథకంను ప్రారంభించగా.. ఈ ఏడాది కూడా సహాయం అందించేందుకు సిద్దమైంది. దాదాపు 12 లక్షల కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూర్చనుంది. ఈ పథకం కింద లబ్ది పొందాలంటే ఎంపీడీవో ఆఫీసులో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం అధికారులు పరిశీలించి లబ్దిదారుల జాబితాలో చేరుస్తారు.

అర్హులు వీళ్లే..

-తెలంగాణ నివాసి అయి ఉండాలి -తమ పేరుపై ఎలాంటి భూమి కలిగి ఉండకూడదు -ఉపాధి హామీ పథకం కింద కనీసం 20 రోజులు పని చేసి ఉండాలి -రేషన్ కార్డు కలిగి ఉండాలి -ఒకే కుటుంబంలో ఒకరికి మాత్రమే నిధులు అందిస్తారు

దరఖాస్తుకు ఏయే పత్రాలు కావాలంటే..?

-రేషన్ కార్డు -రెసిడెన్షియల్ సర్టిఫికేట్ -ఆధార్ కార్డు -ఎమ్మార్వో లేదా వీఆర్వో అందించే భూమి లేదని ధృవీకరించే డాక్యుమెంట్ -ఉపాధి హామీ జాబ్ కార్డ్ -బ్యాంక్ పాస్ బుక్ -పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు

దేవుడు మనల్ని పాపం చేయకుండా ఎందుకు ఆపడు? ఈ అద్భుతం తెలుసుకోండి
దేవుడు మనల్ని పాపం చేయకుండా ఎందుకు ఆపడు? ఈ అద్భుతం తెలుసుకోండి
తెలంగాణ ప్రభుత్వం తీపికబురు.. వారందరికీ అకౌంట్లోకి రూ.6 వేలు
తెలంగాణ ప్రభుత్వం తీపికబురు.. వారందరికీ అకౌంట్లోకి రూ.6 వేలు
శరీరంపై పుట్టుమచ్చలు ఎందుకు కనిపిస్తాయి.. వాటి వెనుక ఉన్న అసలు..
శరీరంపై పుట్టుమచ్చలు ఎందుకు కనిపిస్తాయి.. వాటి వెనుక ఉన్న అసలు..
చిరు సినిమాకు రివ్యూ, రేటింగ్ ఇవ్వకూడదు.. కోర్టు సంచన తీర్పు
చిరు సినిమాకు రివ్యూ, రేటింగ్ ఇవ్వకూడదు.. కోర్టు సంచన తీర్పు
చనిపోతానని తెలిసి 15 ఏళ్ల క్రితమే సమాధి కట్టుకున్నాడు.. ఎందుకంటే
చనిపోతానని తెలిసి 15 ఏళ్ల క్రితమే సమాధి కట్టుకున్నాడు.. ఎందుకంటే
ఈ రాశుల వారు నల్ల బట్టలు వేస్తే కష్టాలు కోరి తెచ్చుకున్నట్టే..
ఈ రాశుల వారు నల్ల బట్టలు వేస్తే కష్టాలు కోరి తెచ్చుకున్నట్టే..
కావాలని అమ్మాయిలను టచ్ చేస్తారు.. ఆ వేధింపులు భరించలేము.. హీరోయిన
కావాలని అమ్మాయిలను టచ్ చేస్తారు.. ఆ వేధింపులు భరించలేము.. హీరోయిన
సినిమా రిలీజ్ అగిపోవడంతో.. జననాయగన్‌ ప్రొడ్యూసర్ ఎమోషనల్..
సినిమా రిలీజ్ అగిపోవడంతో.. జననాయగన్‌ ప్రొడ్యూసర్ ఎమోషనల్..
27 ఏళ్ల తర్వాత తొలిసారి.. వడోదర వన్డేలో సరికొత్త చరిత్ర
27 ఏళ్ల తర్వాత తొలిసారి.. వడోదర వన్డేలో సరికొత్త చరిత్ర
ఏపీ మీదుగా మరో మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు
ఏపీ మీదుగా మరో మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు