AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చదువుకోకుండానే కంపెనీ పెట్టాడు.. చనిపోతానని తెలిసి 15 ఏళ్ల క్రితమే సమాధి కట్టుకున్నాడు.. ఎక్కడంటే..

ఆరడుగుల నేల కోసం ఆఖరి నిమిషంలో.. ఎవరికీ భారం కాకూడదనుకున్నాడు.. చావును కూడా ఒక పండుగలా, ముందే రాసిపెట్టుకుని.. దాన్ని వీలునామాలా మార్చుకున్నాడు. తానొక రోజు వెళ్లిపోతానని తెలుసు.. అందుకే తాను నిద్రపోయే 'శాశ్వత గృహాన్ని' పదిహేనేళ్ల ముందే నిర్మించుకున్నాడు. ఈ రియల్ స్టోరీ ఎక్కడో ఈ కథనంలో తెలుసుకోండి..

చదువుకోకుండానే కంపెనీ పెట్టాడు.. చనిపోతానని తెలిసి 15 ఏళ్ల క్రితమే సమాధి కట్టుకున్నాడు.. ఎక్కడంటే..
Agityal Man's Unique Story
G Sampath Kumar
| Edited By: |

Updated on: Jan 11, 2026 | 3:58 PM

Share

ఆరడుగుల నేల కోసం ఆఖరి నిమిషంలో.. ఎవరికీ భారం కాకూడదనుకున్నాడు.. చావును కూడా ఒక పండుగలా, ముందే రాసిపెట్టుకుని.. దాన్ని వీలునామాలా మార్చుకున్నాడు. తానొక రోజు వెళ్లిపోతానని తెలుసు.. అందుకే తాను నిద్రపోయే ‘శాశ్వత గృహాన్ని’ పదిహేనేళ్ల ముందే నిర్మించుకున్నాడు. సమాధిని నిర్మించుకున్న కొన్నేళ్ల తర్వాత చివరకు తుదిశ్వాస విడిచాడు.. అయితే.. ఆయన ఆశ పడిన చోటే, సొంతంగా కట్టుకున్న సమాధిలోనే అంత్యక్రియలను నిర్వహించారు కుటుంబసభ్యులు.. వివరాల ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన నక్క ఇందయ్య (అలియాస్ జాన్ పెద్దగా చదువుకోకపోయినా, అసాధారణమైన ఆత్మ విశ్వాసం ఆయన సొంతం. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఇందయ్య.. అక్కడ కార్మికుడిగా మిగిలిపోలేదు. తన కష్టార్జితంతో ఏకంగా ఒక కంపెనీనే స్థాపించి, ఎంతోమందికి అన్నం పెట్టాడు.

కొన్నాళ్ల క్రితం తిరిగి గ్రామానికి వచ్చి పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు.ఇందయ్య ఆలోచనలు లోకానికి భిన్నం. మరణానంతరం తన పిల్లలకు భారం కాకూడదని, తన అంత్యక్రియల కోసం ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదని నిర్ణయించుకున్నాడు. ఆ నిశ్చయంతోనే 2009లో సుమారు రూ.8 లక్షల ఖర్చుతో గ్రామ శివారులోని సొంత భూమిలో రాతి సమాధిని నిర్మించుకున్నాడు.

వీడియో చూడండి..

రోజూ సమాధిని సందర్శించి అక్కడ కాసేపు గడిపేవాడు. తన అంత్యక్రియలు అక్కడే చేయాలని కుటుంబ సభ్యులకు ముందే స్పష్టం చేశాడు. ఇందయ్యకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు సంతానం. పిల్లలకు పెళ్లి అయ్యింది. వారికి సంతానం కూడా ఉన్నారు. వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందయ్య, కరీంనగర్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచాడు.

తండ్రి చివరి కోరికను మన్నించి, ఆయన కుమారులు, కూతుల్లు.. ఆయన 15 ఏళ్ల క్రితం కట్టుకున్న ఆ రాతి సమాధి వద్దే అంత్యక్రియలు నిర్వహించారు. చదువుకోకపోయినా జీవిత సత్యాన్ని ఒంటబట్టించుకున్న ఈ ‘జాన్’ కథ ఇప్పుడు ఆ ప్రాంతంలో చర్చనీయాంశమైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..