Weather: ఇక్కడ చలి.. అక్కడ వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది.. తాజా వెదర్ రిపోర్ట్..
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శ్రీలంకలో తీరం దాటింది. జాఫ్నా–ట్రింకోమలై మధ్య తీరం వాయుగుండం దాటింది. తీవ్ర వాయుగుండం బలహీనపడి వాయుగుండంగా మార్పు చెందిందని.. పశ్చిమంగా కదులుతూ దక్షిణ తమిళనాడు వైపు పయనిస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శ్రీలంకలో తీరం దాటింది. జాఫ్నా–ట్రింకోమలై మధ్య తీరం వాయుగుండం దాటింది. తీవ్ర వాయుగుండం బలహీనపడి వాయుగుండంగా మార్పు చెందిందని.. పశ్చిమంగా కదులుతూ దక్షిణ తమిళనాడు వైపు పయనిస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తమిళనాడులో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అంతేకాకుండా.. ఏపీలోని రాయలసీమ , దక్షిణ కోస్తాలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. దక్షిణ తమిళనాడు తీరప్రాంతము, దానికి ఆనుకుని ఉన్న గల్ఫ్ ఆఫ్ మన్నార్ మీదుగా ఏర్పడిన అల్పపీడన ప్రాంతం బలహీన పడింది. అయితే, అనుబంధ ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది.
ఆంధ్రప్రదేశ్ వాతావరణం రిపోర్ట్
ఆంధ్ర ప్రదేశ్, యానములో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య, తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-
ఆదివారం, సోమవారం, మంగళవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ రాయలసీమ:-
ఆదివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది.
సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
మంగళవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది..
గమనిక :- రాగల 5 రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు ఉండదు .
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, వాతావరణ హెచ్చరికలు :
తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానముగా తూర్పు/ఆగ్నేయ దిశల నుండి వీచుచున్నవి. వీటి ప్రభావంతో రాగల 3 రోజులకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం, సోమవారం, మంగళవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2°C నుండి 3°C తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
