AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అలర్ట్..! మీ సేవలో మరికొన్ని సర్టిఫికేట్లు.. కొత్తగా తొమ్మిది రెవెన్యూ సేవలు…!

తెలంగాణలోని మీ-సేవ కేంద్రాలు పలు రకాలైన ప్రభుత్వ సేవలను పౌరులకు అందిస్తున్న సంగతి తెలిసిందే! అయితే తాజాగా మీ-సేవ కేంద్రాల ద్వారా మరో తొమ్మిది రకాల సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది.

Telangana: అలర్ట్..! మీ సేవలో మరికొన్ని సర్టిఫికేట్లు.. కొత్తగా తొమ్మిది రెవెన్యూ సేవలు...!
Mee Seva
Peddaprolu Jyothi
| Edited By: Balaraju Goud|

Updated on: Aug 31, 2024 | 5:01 PM

Share

తెలంగాణలోని మీ-సేవ కేంద్రాలు పలు రకాలైన ప్రభుత్వ సేవలను పౌరులకు అందిస్తున్న సంగతి తెలిసిందే! అయితే తాజాగా మీ-సేవ కేంద్రాల ద్వారా మరో తొమ్మిది రకాల సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. మండల కేంద్రాల్లోని ఎమ్మార్వో కార్యాలయంలో కాకుండా ప్రజలకు అవసరమైన వివిధ పత్రాలను మీ-సేవ కేంద్రాల నుంచి ఆన్‌‌లైన్ ద్వారా అందించాలని ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన కమిషనర్ కీలకంగా నిర్ణయించారు.

ప్రస్తుతం ఎమ్మార్వో కార్యాలయాల్లో జారీ చేస్తున్న పత్రాలను ప్రజలు నేరుగా మీ-సేవ కేంద్రాల నుంచి ఆన్‌‌లైన్ పొందేలా చర్యలు చేపట్టారు. కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన 9 రకాల పత్రాలకు సంబంధించిన వివరాలు మీ-సేవ ఆన్ బోర్డులో ఉంచేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన కమిషనర్ కార్యాలయానికి జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. పేరు మార్చుకోవడం, లోకల్ క్యాండిడేట్, విద్యార్థులకు అవసరమైన స్టడీ క్యాప్ సర్టిఫికెట్, క్రిమిలేయర్, నాన్ ప్రీమియర్, మైనారిటీ ధ్రువీకరణ పత్రాలు, ఆర్ ఓ ఆర్ వన్ బి సర్టిఫైడ్ కాపీలు సైతం మీ సేవ కేంద్రాల నుంచి జారీ చేయనున్నారు.

ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ త్వరలో దస్త్రాలు యాజమాన్య హక్కుల చట్టాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ చట్టానికి సంబంధించి క్షేత్రస్థాయిలో కీలక సూచనలు అందాయి. తహశీల్దార్ స్థాయిలోనే అధికారులు ఉండాలని ఎక్కువ మంది ప్రజల నుంచి అభ్యర్థనలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జులై రెండు నుంచి 23వ తేదీ వరకు ఆర్ఓఆర్ 2024 చట్టానికి సంబంధించిన ముసాయిదాను ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన కమిషనర్ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచి వివిధ వర్గాల నుంచి సలహాలు సూచనలు అభ్యంతరాలను స్వీకరించారు. అభ్యర్థలన్నింటిని పరిశీలించి కొత్త చట్టంలో చేర్చాల్సిన ముసాయిదాను రూపొందించాలని కమిషనర్ నవీన్ మిట్టల్, సంబంధిత అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియతో త్వరలోనే పూర్తి కానుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..