Gruha Jyothi: గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్ న్యూస్.! పెండింగ్ బిల్స్ చెల్లించాల్సిందే..
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పథకం ద్వారా తెల్లరేషన్ కార్డుదారులకు 200 యూనిట్ల లోపు కరెంట్ వాడుకున్నవారి బిల్లు రద్దుచేస్తామని ప్రకటించింది. అప్పటినుంచి తెల్లరేషన్ కార్డు దారులు కరెంట్ బిల్లు కట్టడం మానేశారు. దాంతో 7 నెలలుగా వారి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం గృహజ్యోతి నాన్ అప్లయిడ్ దరఖాస్తులు ఆన్‌లైన్ అవుతున్నాయి. దీంతో చాలా మంది లబ్ధిదారులు గృహజ్యోతికి అర్హత సాధించామని సంబరపడుతున్నారు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పథకం ద్వారా తెల్లరేషన్ కార్డుదారులకు 200 యూనిట్ల లోపు కరెంట్ వాడుకున్నవారి బిల్లు రద్దుచేస్తామని ప్రకటించింది. అప్పటినుంచి తెల్లరేషన్ కార్డు దారులు కరెంట్ బిల్లు కట్టడం మానేశారు. దాంతో 7 నెలలుగా వారి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం గృహజ్యోతి నాన్ అప్లయిడ్ దరఖాస్తులు ఆన్‌లైన్ అవుతున్నాయి. దీంతో చాలా మంది లబ్ధిదారులు గృహజ్యోతికి అర్హత సాధించామని సంబరపడుతున్నారు. కానీ ఇన్నిరోజులు వినియోగించిన విద్యుత్తుకు బిల్లులు చెల్లించాల్సిందే అంటున్నారు. అధికారులు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 13,85,385 గృహ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. 8,78,360 కనెక్షన్లకు సున్నా బిల్లులు వస్తుండగా, 5,07,025 కనెక్షన్ల లబ్ధిదారులు పథకం ఫలాలు పొందటం లేదు. వాణిజ్య కనెక్షన్లు మినహా కొంతమంది బిల్లులు చెల్లిస్తున్నారు. దరఖాస్తుల సవరణకు ప్రభుత్వం పురపాలక, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఏడు నెలలుగా గృహజ్యోతికి సంబంధించిన సైట్ తెరుచుకోలేదు. ఏడు నెలలలో రూ.3 వేల నుంచి 4 వేల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. నెలల తరబడి అధికారులు తిరిగినా ఎవరూ చెల్లించటం లేదు. గతంలో విద్యుత్తు బిల్లులను వినియోగదారులు ఫోన్‌పే, ఇతర యాప్‌ల ద్వారా చెల్లించేవారు. జులై 1 నుంచి ఈ సేవలను ఆర్‌బీఐ నిలిపివేయటంతో విద్యుత్తుశాఖకు సంబంధించిన యాప్‌లో చెల్లించేలా రూపకల్పన చేశారు. భారీగా పాత బకాయిలు పేరుకుపోవడంతో వాటి వసూలుకు ఆర్‌బీఐకి విన్నవించుకోవటంతో మళ్లీ ఫోన్ పే ద్వారా చెల్లించుకొనేందుకు వెసులుబాటు కల్పించింది. ఇప్పటి వరకు ఉన్న బకాయిలను ఈ యాప్‌లో చెల్లించుకోవచ్చని విద్యుత్తు అధికారులు పేర్కొంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే.. గృహజ్యోతి పథకానికి అర్హత సాధించినప్పటి నుంచే సున్నా బిల్లు వర్తిస్తుంది. అర్హత ఉండి ఆన్‌లైన్‌లో నమోదు కానివారు పెండింగ్ బిల్లులను తప్పక చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయమై వినియోగదారులు సహకరించి బిల్లులు చెల్లించాలని చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

