AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ప్లేస్‌ ఒక్కటే.. ఒక్కో రోజూ ఒక్కో స్టైల్‌లో పూజలు.. ఏంటని ఆరా తీయగా..

జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండలం రంగసాగర్ గ్రామ శివార్లలో వరుసగా జరుగుతున్న క్షుద్ర పూజలు స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. జనాలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయాల్లో ఈ పనులు చేస్తుండటంతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది.

Telangana: ప్లేస్‌ ఒక్కటే.. ఒక్కో రోజూ ఒక్కో స్టైల్‌లో పూజలు.. ఏంటని ఆరా తీయగా..
Jagtial Black Magic
G Sampath Kumar
| Edited By: |

Updated on: Mar 01, 2026 | 3:22 PM

Share

జగిత్యాల జిల్లాలోని రంగసాగర్ గ్రామ ప్రజలకు క్షుద్రపూజలు కంటిమీద కునుకు లేకుండా చేస్తు్న్నాయి. తాజాగా, గ్రామానికి చెందిన శ్రీరాముల గంగయ్య పొలం వద్ద ఉన్న చింత చెట్టు ముందు గత మూడు రోజుల నుండి ఈ క్షుద్ర పూజలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ ఒక కొత్త పద్ధతిలో, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, ఇతర పూజా సామాగ్రితో ఈ వికృత చేష్టలకు పాల్పడుతున్నారు గుర్తుతెలియని వ్యక్తులు.

అయితే గతంలోనూ నాగవత్ రాజేష్ నాయక్ ఇంటి ముందు ఇలాంటి పూజలే జరిగాయి. ఆ తర్వాత బాణావత్ గంగారాం ఇంటి పక్కన కూడా గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించి స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. వరుసగా జరుగుతున్న ఈ ఘటనల వెనుక ఎవరున్నారో తెలియక గ్రామస్థులు భయాందోళనకు లోనవుతున్నారు.

ముఖ్యంగా రైతులు పొలాలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. పోలీసులు స్పందించి, రాత్రి పూట గస్తీ పెంచి, ఈ పనులకు పాల్పడుతున్న నిందితులను పట్టుకోవాలని రంగసాగర్ గ్రామస్తులు కోరుతున్నారు. దీంతో గ్రామస్తులు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ప్రతి ఆదివారం ఇదే విధంగా పూజలు చేయడంతో మరింత ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us