AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కామన్‌ మొబిలిటీ కార్డుకు మంచి పేరు పెట్టండి.. తెలంగాణ పౌరులను కోరిన మంత్రి కేటీఆర్‌

Common Mobility Card: కామన్‌ మొబిలిటీ కార్డును తీసుకొచ్చే ప్రయత్నాన్ని తెలంగాణ ప్రభుత్వం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ మెట్రో రైల్‌, ఆర్టీసీ సంస్థలు ఇప్పటికే కార్యాచరణకు సిద్ధమవుతోంది. హైదరాబాద్‌ మహా నగరంలో..

Hyderabad: కామన్‌ మొబిలిటీ కార్డుకు మంచి పేరు పెట్టండి.. తెలంగాణ పౌరులను కోరిన మంత్రి కేటీఆర్‌
Hyderabad Public Transport
Sanjay Kasula
|

Updated on: Jul 20, 2023 | 8:44 PM

Share

త్వరలో కామన్ మొబిలిటీ కార్డుని ప్రవేశపెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. హైదరాబాద్‌ నరంలోని ప్రజా రవాణ వ్యవస్థను మొత్తాన్ని ఒకే గొడుకు కిందికి తెచ్చేందుక రెడీ అవుతోంది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా ఒక కామన్‌ మొబిలిటీ కార్డును తీసుకొచ్చే ప్రయత్నాలను వేగవంతం చేసింది. కామన్‌ మొబిలిటీ కార్డును తీసుకొచ్చే ప్రయత్నాన్ని తెలంగాణ ప్రభుత్వం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా నగరంలోని మెట్రో రైలు, ఆర్టీసీ సంస్థలను కలిపి ఓ ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్‌ మహా నగరంలో ప్రధానమైన పబ్లీక్ ట్రాన్స్‌పోర్టు వ్యవస్థలైన ఉన్న మెట్రో రైలు, ఆర్టీసీ బస్సుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించేలా ఈ కార్డును తీసుకురానున్నారు.

కామన్ మొబిలిటీ కార్డు తీసుకొచ్చే అంశంపై అధికారులతో మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌, శ్రీనివాస్‌గౌడ్‌  సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఆర్టీసీ, మెట్రో రైలు సంస్థల అధికారులు కార్డుకు సంబంధించిన ఇన్‌పుట్స్‌ను అందించారు. ముందుగా మెట్రో రైలు, ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి వీలుగా కార్డుని జారీ చేస్తామని.. ఇదే కార్డుతో భవిష్యత్తులో ఎంఎంటీఎస్‌, క్యాబ్‌ సేవలు, ఆటోలను కూడా వినియోగించుకునేలా ఎక్సెటెండ్ చేస్తామన్నారు మంత్రులు.

ఇతర కార్డుల తరహాలో రిటైల్‌ షాప్స్‌లో కూడా వీటితో కొనుగోళ్లు చేసేందుక ఉపయోగించుకునేలా ‘వన్‌ కార్డ్‌ ఫర్‌ ఆల్‌ నీడ్స్‌’ మాదిరి ఉండేలా ప్లాన్ చేయాలని మంత్రులు అధికారులకు సూచించారు. ఈ కామన్ మొబిలిటీ కార్డుకు ఓ మంచి పేరు సూచించాలని అన్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ పేర్లు సూచించాలని కోరుతూ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం