Telangana: తెలంగాణలో ఓట్లు-పాట్లు.. బిగ్ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తలపడుతున్న మూడు ప్రధానపార్టీలు రంకలేస్తున్నాయి. కొంతకాలంగా దూకుడు తగ్గిందన్న విమర్శలకు చెక్‌ పెడుతూ బీజేపీ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల అంశంతో ఒక్కసారిగా దూసుకొచ్చింది. యుద్ధం మొదలైంది ఇక కాస్కోండి అంటూ బీజేపీ ప్రత్యర్ధులకు సవాల్‌ విసురుతోంది. అటు కాంగ్రెస్‌ సీనియర్లు కూడా ఐక్యతారాగం వినిపిస్తూ బస్‌ యాత్రలకు సిద్ధమవుతున్నాయి.

Telangana: తెలంగాణలో ఓట్లు-పాట్లు.. బిగ్ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌.
Big News Big Debate
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 20, 2023 | 9:15 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తలపడుతున్న మూడు ప్రధానపార్టీలు రంకలేస్తున్నాయి. కొంతకాలంగా దూకుడు తగ్గిందన్న విమర్శలకు చెక్‌ పెడుతూ బీజేపీ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల అంశంతో ఒక్కసారిగా దూసుకొచ్చింది. యుద్ధం మొదలైంది ఇక కాస్కోండి అంటూ బీజేపీ ప్రత్యర్ధులకు సవాల్‌ విసురుతోంది. అటు కాంగ్రెస్‌ సీనియర్లు కూడా ఐక్యతారాగం వినిపిస్తూ బస్‌ యాత్రలకు సిద్ధమవుతున్నాయి. జాతీయ పార్టీలకు భిన్నంగా అధికార బీఆర్ఎస్‌ సామాజిక సమీకరణాలపైనా ఫోకస్‌ పెట్టింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఫుల్‌ ఫోకస్ పెట్టాయి ప్రధానపార్టీలు. అంతర్గత సమస్యలతో ఇబ్బందులు పడుతూ వచ్చిన బీజేపీ ఎట్టికేలకు స్పీడు పెంచింది. విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ వస్తూనే డబుల్‌ బెడ్‌రూం ఇళ్లపై యుద్ధభేరి మోగించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ రెడ్డి. నియంతృత్వ పాలనపై యుద్ధం మొదలైందని.. ఇక ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉండాలంటూ బీఆర్ఎస్‌ నేతలకు సవాల్‌ విసిరారు. ఛలో బాటసింగారం ఇచ్చిన హైప్‌ను కంటిన్యూ చేయాలని పార్టీ భావిస్తోంది.

అయితే బీజేపీ ఛలో బాట సింగారం అంతా డ్రామా అంటోంది కాంగ్రెస్‌. రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పడిపోతుండడంతో కేసీఆర్ కావాలనే రహస్యమిత్రుడికి మళ్లీ హైప్‌ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారన్నారు హస్తం నేతలు. రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ మొదలైందని దీంతో బీఆర్ఎస్‌- బీజేపీ కలిసి కొత్త నాటకానికి తెరతీశాయన్నారు. బీజేపీ- బీఆర్ఎస్‌ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు బస్‌యాత్రలు చేపడతామంటోంది కాంగ్రెస్ పార్టీ.

విపక్షాల దూకుడు ఎలా ఉన్నా అధికార బీఆర్ఎస్‌ చాపకిందనీరులా సోషల్‌ ఇంజినీరింగ్‌పై దృష్టిపెట్టి ఆచరణలోకి దిగింది. ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సారధ్యంలో బీసీ కార్డు అందుకున్న బీఆర్‌ఎస్‌.. తాజాగా మైనార్టీలు దూరం కాకుండా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. కామన్‌ సివిల్‌కోడ్‌ అంశాన్ని అందిపుచ్చుకోవడంతో పాటు కొత్త పథకాలతో రావాలనుకుంటోంది. మొత్తానికి మూడుపార్టీలు నువ్వా – నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. లైఫ్‌ డెత్‌ ఎన్నికలుగా భావిస్తున్నాయి. మరి హస్తం పార్టీ ఐక్యంగా సత్తా చాటుకుంటుందా? కాషాయం వచ్చిన హైప్‌ను నిలబెట్టుకుందా? బీఆర్ఎస్‌ తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రయోగిస్తున్న సోషల్‌ ఇంజినీరింగ్‌ సఫలమవుతుందా?