నడి రోడ్డుపై ప్రదక్షిణలు చేస్తున్న ఎలుగుబంటి.. అసలేం జరిగింది ??

నడి రోడ్డుపై ప్రదక్షిణలు చేస్తున్న ఎలుగుబంటి.. అసలేం జరిగింది ??

Phani CH

|

Updated on: Jul 20, 2023 | 4:34 PM

శ్రీకాకుళం జిల్లాల ఓ ఎలుగుబంటి వింతగా ప్రవర్తించింది. రోడ్డు పక్కన ప్రదక్షిణలు చేస్తూ కనిపించింది. దాంతో అటుగా వెళ్తున్న వాహదారులు ఆ ఎలుగుబంటిని చూసి భయంతో పరుగులు తీశారు. ఈ ఎలుగుబంటి విషయం స్థానికులకు తెలియడంతో పెద్ద ఎత్తున ఎలుగుబంటిని చూసేందుకు జనం పోటెత్తారు.

శ్రీకాకుళం జిల్లాల ఓ ఎలుగుబంటి వింతగా ప్రవర్తించింది. రోడ్డు పక్కన ప్రదక్షిణలు చేస్తూ కనిపించింది. దాంతో అటుగా వెళ్తున్న వాహదారులు ఆ ఎలుగుబంటిని చూసి భయంతో పరుగులు తీశారు. ఈ ఎలుగుబంటి విషయం స్థానికులకు తెలియడంతో పెద్ద ఎత్తున ఎలుగుబంటిని చూసేందుకు జనం పోటెత్తారు. పొలాలకు వెళ్లే రైతులకు, జీడి తోటల్లో పనులు చేసుకునే కూలీలకు ప్రతిరోజూ ఎలుగుబంట్లు కనిపించడం పరిపాటే. ఒక్కోసారి ఈ ఎలుగుబంట్లు వారిపై దాడులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా మందస మండలం పెద్ద లోహరిబందలో ఓ ఎలుగుబంటి వింతగా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గ్రామ శివారులోని మెట్టవద్ద రోడ్డు పక్కన ప్రదక్షిణలు చేస్తున్నట్టుగా చుట్టూ గిర గిరా తిరుగుతూ కనిపించింది. అదిచూసి అటుగా బైక్ పైన వెళ్తున్న ఓ వ్యక్తి భయంతో బైక్ ని రోడ్డుపై పడేసి గ్రామంలోకి పరుగులు పెట్టాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమ్మ కోసం.. అన్నీ వదిలాడు.. అడిగితే.. తల్లి రుణం తీర్చుకోవడంమే నా ఆనందం అంటున్నాడు

వరదలో కొట్టుకొచ్చిన పాల ప్యాకెట్లు.. ఎగబడిన జనం

వధూవరులకు అదిరిపోయే గిఫ్ట్‌.. బంగారాన్ని మించి..

అడుగడుగునా సీసీ కెమెరాలు… పటిష్టమైన పోలీసు భద్రత… ఎవరికో తెలుసా ??

Jr NTR: యాక్షన్ రోల్ లో కనిపించనున్న ఎన్టీఆర్