AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Free Tomato: నా ఆటోలో ప్రయాణిస్తే కిలో టమాటాలు ఫ్రీ.. ఫ్రీ.. కానీ ఓ కండీషన్ పెట్టాడు.. అదేంటంటే..

పంజాబ్ చండీగఢ్‌లోని ఓ ఆటో డ్రైవర్ ట్రెండింగ్‌లో నిలిచాడు. వినూత్న రీతిలో ప్రచారం మొదలు పెట్టాడు. తన ఆటోలో ప్రయాణించిన వారికి ఉచితంగా టమాటాలు ఇస్తానని ప్రకటించాడు. కానీ, దీనికి ఓ కండీషన్ పెట్టాడు. దీనికి సంబంధించిన పోస్టర్ ను ఆటో వెనకాల అంటించడంతో వైరల్ గా మారింది.

Free Tomato: నా ఆటోలో ప్రయాణిస్తే కిలో టమాటాలు ఫ్రీ.. ఫ్రీ.. కానీ ఓ కండీషన్ పెట్టాడు.. అదేంటంటే..
Tomato
Sanjay Kasula
|

Updated on: Jul 19, 2023 | 4:17 PM

Share

టమాటా ధరలు విపరీతంగా పెరిగాయి. టమాటా రైతులు లక్షాధికారులుగా మారుతున్నారు. టమాటా రక్షణ కోసం బౌన్సర్లను నియమిస్తున్నారు. టమోటాల కోసం కూడా హత్యలు జరిగాయి. ప్రస్తుతం దేశంలో టమాటా ధర పెరగడం ట్రెండ్. టమాటా ధర పెరగడం చాలా మందిని కలచివేసింది. టమాటా కొనేందుకు జనం దిక్కులు చూస్తున్నారు. అయితే అదే టొమాటో మీకు ఉచితంగా లభిస్తే? అవును, చండీగఢ్‌కు చెందిన ఓ ఆటో డ్రైవర్ తన ఆటోలో ప్రయాణిస్తే ఉచితంగా టమోటాలు ఇస్తానని చెప్పడం వైరల్‌గా మారింది. గత కొన్నేళ్లుగా ఆటోలు నడుపుతున్న అరుణ్ 12 ఏళ్లుగా ఇండియన్ ఆర్మీ సైనికులకు ఉచితంగా ఆటో రిక్షా సవారీలు ఇస్తున్నాడు. తమ ఆటోలో దీనిపై బోర్డు పెట్టారు. దీంతో పాటు గర్భిణులను ఆస్పత్రికి తరలించేందుకు ఉచితంగా ఆటోలు అందజేస్తున్నాడు.

ఇప్పుడు తన ఆటోలో ప్రయాణీకులకు ఉచితంగా టమోటాలు ఇస్తామని ప్రకటించడంతో మరింత సంచలనంగా మారారు. తన రిక్షాలో ఐదుసార్లు ప్రయాణిస్తే కిలో టమాటా ఉచితంగా ఇస్తానని చెప్పాడు. కానీ, దీనికి ఓ కండీషన్ పెట్టాడు. తన ఆటోలో ఐదుసార్లు ప్రయాణించిన వారికి మాత్రమే ఈ కిలో టమాటాలు ఇస్తానని చెప్పడం మారింత ఆశ్చర్యానికి గురిచేశారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఆటో వెనకాల అంటించడంతో వైరల్ గా మారింది.

దీంతో పాటు అక్టోబర్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ గెలిస్తే.. వారంలో 5 రోజులు చండీగఢ్‌లో ఉచితంగా రిక్షా తొక్కుతానని చెప్పాడు. ఉచితంగా టమాటాలు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లోని ఒక షూ-స్టోర్ యజమాని తన కస్టమర్‌లు తన స్టోర్ నుండి బూట్లు కొంటే వారికి 2 కిలోల టమోటాలు ఉచితంగా ఇచ్చే ప్లాన్‌ను ప్రకటించారు. రూ.1,000 నుంచి రూ.1,500 మధ్య ధర కలిగిన షూలను కొనుగోలు చేస్తే ప్రత్యేక సేల్ ఆఫర్ కింద 2 కిలోల టమోటాలు ఉచితంగా పొందవచ్చని ప్రకటించింది. మధ్యప్రదేశ్‌లోని ఒక మొబైల్ దుకాణదారుడు తన దుకాణంలో స్మార్ట్‌ఫోన్‌లు కొనుగోలు చేసే వారికి ఉచితంగా టమోటాలు అందిస్తున్నాడు.

మరిన్ని ట్రెండిగ్ న్యూస్ కోసం

Follow Us
చిరంజీవి సినిమాను రిజెక్ట్ చేసిన నటుడు.. కట్ చేస్తే
చిరంజీవి సినిమాను రిజెక్ట్ చేసిన నటుడు.. కట్ చేస్తే
ఒంటికి చలువ..ఇంటిల్లిపాదికి ఆరోగ్యం!ఈ కూరగాయ బోర్‌ అనకుండా తినాలి
ఒంటికి చలువ..ఇంటిల్లిపాదికి ఆరోగ్యం!ఈ కూరగాయ బోర్‌ అనకుండా తినాలి
గణిత, వైఫై అన్వేషణలకు ఆర్డీవోకు అంతర్జాతీయ గుర్తింపు!
గణిత, వైఫై అన్వేషణలకు ఆర్డీవోకు అంతర్జాతీయ గుర్తింపు!
ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు ప్రపంచ రికార్డ్ బద్దలు..!
ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు ప్రపంచ రికార్డ్ బద్దలు..!
ఐస్‌ వాటర్‌ ఫెషియల్‌ ఇలా చేయడం వల్ల బోలెడు లాభాలు..అందమే అందం!
ఐస్‌ వాటర్‌ ఫెషియల్‌ ఇలా చేయడం వల్ల బోలెడు లాభాలు..అందమే అందం!
24 గంటల్లోనే మరో గాయం.. హార్దిక్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?
24 గంటల్లోనే మరో గాయం.. హార్దిక్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?
కొత్త కార్ కొనాలా? భారీ డిస్కౌంట్లు పొందేందుకు 'బెస్ట్ టైమ్' ఇదే.
కొత్త కార్ కొనాలా? భారీ డిస్కౌంట్లు పొందేందుకు 'బెస్ట్ టైమ్' ఇదే.
బాలనాగమ్మ సినిమా చిత్రీకరణ అయినా ఎందుకు రిలీజ్ కాలేదంటే..?
బాలనాగమ్మ సినిమా చిత్రీకరణ అయినా ఎందుకు రిలీజ్ కాలేదంటే..?
నాటు గుడ్డు.. ఫారం గుడ్డు: ఏది ఆరోగ్యానికి మంచిది? నిపుణుల సూచన
నాటు గుడ్డు.. ఫారం గుడ్డు: ఏది ఆరోగ్యానికి మంచిది? నిపుణుల సూచన
భూమిపై అదే చివరి రోజా.. నవంబర్ 13న ఏం జరగబోతుంది..?
భూమిపై అదే చివరి రోజా.. నవంబర్ 13న ఏం జరగబోతుంది..?