AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి అదిరే శుభవార్త.. త్వరలోనే అవి కూడా పంపిణీ.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్ తెలిపారు. ఇప్పటికే రేషన్ షాపుల ద్వారా బియ్యం. పంచదార పంపిణీ జరుగుతోంది. అయితే త్వరలో మరో ధాన్యాన్ని కూాడా చేర్చారు. లబ్దిదారులకు వీటిని పంపిణీ చేయనున్నారు.

Telangana: తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి అదిరే శుభవార్త.. త్వరలోనే అవి కూడా పంపిణీ.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ration
Venkatrao Lella
|

Updated on: May 06, 2026 | 12:11 PM

Share

తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి రేవంత్ సర్కార్ భారీ శుభవార్త అందించింది. రేషన్ కార్డుదారులకు జొన్నలు కూడా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. రైతుల నుంచి ప్రభుత్వం వీటిని సేకరించి రేషన్ కార్డు లబ్దిదారులకు పంపిణీ చేయనుంది. మార్క్‌ఫెడ్ ద్వారా రైతుల నుంచి జొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. అనంతరం రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు అందించనుంది. రైతుల నుంచి తీసుకున్న జొన్నలను బహిరంగ వేలం వేస్తే మధ్యవర్తులు లాభపడతారు. అదే దీనిని రేషన్ కార్డుదారులకు అందించడం వల్లన పేద ప్రజలకు ప్రయోజనం జరగడమే కాకండా వారి ఆకలి తీర్చడంలో ముఖ్యమపాత్ర పోషిస్తుందని ప్రభుత్వం చెబుతోంది.

జొన్నలు పంపిణీ

ప్రజాభవన్‌లో రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్బంగా రేషన్ కార్డుదారులకు జొన్నలు పంపిణీ చేసే విషయంపై కీలక ప్రకటన చేశారు. జొన్నలు పంపిణీ చేయడం వల్ల పేదల ఆకలి తీరడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. సామాన్యుడి సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో పండించే మక్కలను నేరుగా పాల్ట్రీ రైతులకు కేటాయించాలని, ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఇక ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల గురుకురాల్లో విద్యార్థులకు పౌషకాహారం అందించేందుకు జొన్నలు, మక్కలు వినియోగించాలని అధికారులకు భట్టి విక్రమార్క సూచించారు. అలాగే మక్కలను నేరుగా పాల్ట్రీ రైతులకు కేటాయించాలని సూచించారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడంపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అటు యాసంగి పంటకు సంబంధించి జొన్నలు, మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర సహకారం లేకపోవడంతో రాష్ట్ర నిధులతోనే సేకరించనున్నట్లు తెలిపింది. ఇప్పటికే మొక్కజొన్న కొనుగోళ్లు మొదలవ్వగా.. జొన్నల కొనుగోళ్లు కూడా త్వరలో ప్రారంభించనుంది.

ఏపీలో జరుగుతున్న పంపిణీ

అటు ఏపీలో ఇప్పటికే రేషన్ దుకాణాల ద్వారా జొన్నలు, రాగులు పంపిణీ చేస్తున్నారు. కొంత బియ్యం కోటాకు బదులు రాగులు, జొన్నలు అందిస్తున్నారు. అలాగే గోధుములు కూడా కొన్ని ప్రాంతాల్లో పంపిణీ చేస్తుండగా.. మరికొన్ని జిల్లాల్లో కూడా త్వరలో పంపిణీ మొదలుపెట్టనున్నారు. ఇక కందిపప్పు కూడా తక్కువ ధరకు గతంలో పంపిణీ చేయగా.. ప్రస్తుతం గత కొద్ది నెలలుగా ఆగిపోయింది. ప్రభుత్వం వద్ద నిల్వలు లేకపోవడంతో రేషన్ దుకాణాలకు సరఫరా నిలిచిపోయింది. దీంతో త్వరలో మళ్లీ కందిపప్పు పంపిణీ కూడా మొదలుపెట్టాలని ప్రభుత్వం చూస్తోంది. దీంతో వీటి కోసం పేదలు ఎదురుచూస్తున్నారు.

Follow Us
ఎండకాలంలో ట్యాంక్ నీరు గీజర్‌లా వస్తోందా? ఈ మెరిసే పేపర్‌ ట్రిక్‌
ఎండకాలంలో ట్యాంక్ నీరు గీజర్‌లా వస్తోందా? ఈ మెరిసే పేపర్‌ ట్రిక్‌
గొంతు నొప్పికి చెక్ పెట్టె పురాతన కాలం నాటి అల్లం చట్నీ
గొంతు నొప్పికి చెక్ పెట్టె పురాతన కాలం నాటి అల్లం చట్నీ
మోడ్రన్ గౌన్ల హడావుడికి చెక్ పెట్టిన ‘హీరామండి’ బ్యూటీ
మోడ్రన్ గౌన్ల హడావుడికి చెక్ పెట్టిన ‘హీరామండి’ బ్యూటీ
అన్నం కూర ఎందుకు దండగ.. 20 నిమిషాల్లో తయారయ్యే ఈ రెసిపీ ఉండగా
అన్నం కూర ఎందుకు దండగ.. 20 నిమిషాల్లో తయారయ్యే ఈ రెసిపీ ఉండగా
స్వదేశాన్ని ఛీకొట్టిన పాక్ ప్లేయర్.. ఐపీఎల్ వేలంలోకి ఎంట్రీ?
స్వదేశాన్ని ఛీకొట్టిన పాక్ ప్లేయర్.. ఐపీఎల్ వేలంలోకి ఎంట్రీ?
రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. వాతావరణం ఎలా ఉంటుంది..?
రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. వాతావరణం ఎలా ఉంటుంది..?
స్టార్ కపుల్ నివాసం ‘శివశక్తి’ స్పెషాలిటీస్ తెలుసా..?
స్టార్ కపుల్ నివాసం ‘శివశక్తి’ స్పెషాలిటీస్ తెలుసా..?
ఎన్టీఆర్ 'డ్రాగన్'మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
ఎన్టీఆర్ 'డ్రాగన్'మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
మీ బైక్‌ పోయిందా? అయితే, ఇక్కడే ఉండొచ్చు!టూ వీలర్‌ ముఠాను అరెస్ట్
మీ బైక్‌ పోయిందా? అయితే, ఇక్కడే ఉండొచ్చు!టూ వీలర్‌ ముఠాను అరెస్ట్
సూర్య సంచారంతో అదృష్టం మారే 4 రాశులు..! వీరిపైనే డబ్బుల వర్షం!
సూర్య సంచారంతో అదృష్టం మారే 4 రాశులు..! వీరిపైనే డబ్బుల వర్షం!