Fuel VAT: పెట్రోల్, డీజిల్‌పై తెలంగాణ ప్రభుత్వం వ్యాట్ భారం తగ్గించాలి: తెలంగాణ రాష్ట్ర జనసేన ఇన్‌చార్జ్
Petrol Diesel VAT: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించి దీపావళి వాహనదారులకు తీపికబురు అందించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర..

Petrol Diesel VAT: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించి దీపావళి వాహనదారులకు తీపికబురు అందించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ. 10 ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. దాదాపు 11 రాష్ట్రాల ప్రభుత్వాలు రాష్ట్ర పరిధిలోని వ్యాట్ తగ్గించి ప్రజలపై పడే భారాన్ని కొంతమేర తగ్గించింది. ఈ నేపథ్యంలో వ్యాట్ భారంపై జనసేన కూడా స్పందించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్‌పై వేస్తున్న వ్యాట్ భారాన్ని తగ్గించి సామాన్యులకు అండగా నిలువాలని తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ నేమూరి శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలతో సతమతమవుతున్న వాహనదారులకు భారం తగ్గించేలా తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేయాలని ఆయన కోరారు.
మరో వైపు రాష్ట్రాల ప్రభుత్వంలానే ఏపీ ప్రభుత్వం కూడా తన వాటా వ్యాట్‌ను తగ్గించి ప్రజలకు పెట్రో భారం నుంచి ఉపశమనం కలిగించాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా డిమాండ్ చేశారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు తమ వాటా వ్యాట్‌ను తగ్గించాయని ఆయన గుర్తుచేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోనుందని ఆయన ప్రశ్నించారు. ఆ మేరకు శుక్రవారంనాడు ఓ ఆయన ప్రకటన విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి: