Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TPCC: టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వైస్ ఛైర్మన్ పదవిని తిరస్కరించిన మాజీ ఎంపీ ఎంఏ ఖాన్..!

TPCC: టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వైస్‌ చైర్మన్‌ పదవిని మాజీ ఎంపీ ఎంఏ ఖాన్‌ తిరస్కరించారు. ఈ మేరకు ఆయన సోనియాగాంధీకి లేఖ రాశారు. నవంబర్ 3న టీపీసీసీ..

TPCC: టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వైస్ ఛైర్మన్ పదవిని తిరస్కరించిన మాజీ ఎంపీ ఎంఏ ఖాన్..!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 06, 2021 | 6:08 AM

TPCC: టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వైస్‌ చైర్మన్‌ పదవిని మాజీ ఎంపీ ఎంఏ ఖాన్‌ తిరస్కరించారు. ఈ మేరకు ఆయన సోనియాగాంధీకి లేఖ రాశారు. నవంబర్ 3న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీని ప్రకటించిన ఏఐసీసీ.. క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా చిన్నారెడ్డి, వైస్ చైర్మన్‌గా ఎం ఏ ఖాన్ నియామకం అయ్యారు. అలాగే సభ్యులుగా సీనియర్‌ నేత ఎ.శ్యామ్‌ మోహన్‌, మాజీ మంత్రి గడ్డం వినోద్‌, మాజీ ఎమ్మెల్యే గంగారాం, మాజీ ఎమ్మెల్సీ కమలాకర్‌ రావు, సీనియర్‌ సీజే శ్రీనివాస రావులను నియమించారు. ఈ మేరకు వీరిని నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే తనను వైస్ చైర్మన్‌గా నియమించండం ఆశ్చర్యపర్చిందని ఖాన్‌ సోనియాగాంధీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఈ పదవిని ఇస్తున్నట్లు టీపీసీసీ నుంచి నాతో ఎవరు చర్చించలేదని, క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ పదవి నాకు సరైంది కాదని ఆయన అన్నారు. నేను ఆ బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా లేనని సోనియాగాంధీకి స్పష్టం చేశారు. కాగా, గతంలో క్రమ శిక్షణ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగిన కోదండరెడ్డి రాజీనామా చేయడంతో ఈ కొత్త కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.

ఇవి కూడా చదవండి:

YS Jagan Praja Sankalpa Yatra: రెండేళ్ల తర్వాత అవే అడుగుజాడలు.. వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రకు నాలుగేళ్లు

Private Travels‌: నల్గొండలో ప్రయాణికులకు షాక్‌.. లగేజీలతో పరారైన బస్సు డ్రైవర్‌