Private Travels‌: నల్గొండలో ప్రయాణికులకు షాక్‌.. లగేజీలతో పరారైన బస్సు డ్రైవర్‌

Private Travels‌: ఈ మధ్య కాలంలో రకరకాల మోసాలు జరుగుతున్నాయి. మోసగాళ్లు కొత్త కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుని అమాయకులను మోసగిస్తున్న..

Private Travels‌: నల్గొండలో ప్రయాణికులకు షాక్‌.. లగేజీలతో పరారైన బస్సు డ్రైవర్‌
Follow us
Subhash Goud

|

Updated on: Nov 06, 2021 | 12:12 AM

Private Travels‌: ఈ మధ్య కాలంలో రకరకాల మోసాలు జరుగుతున్నాయి. మోసగాళ్లు కొత్త కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుని అమాయకులను మోసగిస్తున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఇక తాజాగా ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ ప్రయాణికులను మోసగించింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రావెల్స్‌ బస్సు.. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి వద్ద భోజనం కోసం ఆగింది. ఇక భోజనం కోసం 64 మంది ప్రయాణికులు దిగారు. దీంతో ఆ బస్సు డ్రైవర్‌, క్లీనర్‌ ప్రయాణికుల లగేజీతో ఉడాయించారు. గమనించిన ప్రయాణికులు టెన్షన్‌కు గురయ్యారు. వెంటనే ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రయాణికులకు చిట్యాలలోని ఫంక్షన్‌ హాల్‌లో ఆశ్రయం కల్పించారు. ఈ 64 మంది ప్రయాణికులు కేరళ నుంచి అసోంకు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేరళకు చెందిన గ్యాంగ్ బాస్ ట్రావెల్స్‌కు చెందిన బస్సుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. బస్సు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Crime News: పండగపూట దారుణం.. ఇంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపిన దుండగులు.. ఒకరు మృతి..

Diwali 2021: బాణసంచా కాలుస్తుండగా ప్రమాదం.. నిప్పురవ్వలు పడి అగ్నికి ఆహుతైన కారు..