Corona Virus Effect: పెరుగుతున్న కరోనా కేసులు.. మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు..

Corona Virus Effect: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుండటంతో తెలంగాణ సర్కార్ అలర్ట్ అయ్యింది. ఇందులో భాగంగా రాష్ట్ర..

Corona Virus Effect: పెరుగుతున్న కరోనా కేసులు.. మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు..
etela
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 22, 2021 | 9:34 PM

Corona Virus Effect: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుండటంతో తెలంగాణ సర్కార్ అలర్ట్ అయ్యింది. ఇందులో భాగంగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ సోమవారం నాడు వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలలో కరోనా కేసులు పెరుగుతున్నయని, అధికారులు అప్రమత్తంగా ఉండలాన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికై టెస్టులను పెంచుతామన్నారు. గాంధీ, టిమ్స్, నిమ్స్‌లో మళ్లీ పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరిగిన దాఖలాలు లేవన్న మంత్రి ఈటెల.. కరోనా ఉన్నంత కాలం ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

హెల్త్ డిపార్ట్మెంట్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్‌కి ఒక ధర నిర్ణయించి మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకువస్తే మంచిదని మంత్రి ఈటల అభిప్రాయపడ్డారు. ఒకవేళ మార్కెట్‌లోకి అనమతులు ఇస్తే సంబంధిత చర్యలు చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షలకు పైగా డోసులు ఇచ్చామని వెల్లడించారు. 50 ఏళ్ళు పైబడిన, దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్న వారికి త్వరగా వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉందన్నారు.

కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో కర్ఫ్యూ విధించడంపై స్పందించిన ఆయన.. ప్రస్తుతానికి కర్ఫ్యూపై ఎలాంటి ఆలోచనా లేదని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీల ఆధ్వర్యంలోని ఆస్పత్రుల్లో మందులు, శాస్త్ర చికిత్సలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గత రెండేళ్లుగా నాణ్యమైన, బ్రాండెడ్ మందులను కొనుగోలు చేస్తున్నామన్న ఆయన.. దీనికి సంబంధించి బడ్జెట్ మరింత పెంచుతామన్నారు. ఇదిలాఉండగా, తెలంగాణ డియాగ్నోస్టిక్స్ మంచి ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు.

Also read:

15 ఏళ్ల తర్వాత శ్రీశాంత్​ఖాతాలో 5 వికెట్లు.. కేరళ విజయంలో కీలక పాత్ర..

పెరుగుతున్న కరోనా కేసులు.. మూడు వారాల్లో 36 శాతం పెరుగుదల.. జాగ్రత్తలు తీసుకోకపోతే లాక్‌డౌన్‌ తప్పదు.!