Vijay Hazare Trophy: 15 ఏళ్ల తర్వాత శ్రీశాంత్ఖాతాలో 5 వికెట్లు.. కేరళ విజయంలో కీలక పాత్ర..
ఫిక్సింగ్ నిషేధం తర్వాత దేశవాళీ టోర్నీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన భారత బౌలర్ శ్రీశాంత్.. తాజాగా 5 వికెట్లు తీసి అదరగొట్టాడు. విజయ్ హజారే..
Sreesanth bags Five-Wickets : ఫిక్సింగ్ నిషేధం తర్వాత దేశవాళీ టోర్నీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన భారత బౌలర్ శ్రీశాంత్.. తాజాగా 5 వికెట్లు తీసి అదరగొట్టాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్న శ్రీశాంత్.. తిరిగి సత్తా చాటాడు. ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టి కేరళ జట్టుకు విజయాన్ని అందించాడు. ఫస్ట్ క్లాస్క్రికెట్లో 15 ఏళ్ల తర్వాత తాజాగా మరోసారి ఈ ఘనత అందుకున్నాడు.
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఉత్తర్‌ప్రదేశ్49.4 ఓవర్లకు 283 పరుగులు చేసి ఆలౌటైంది. 9.4 ఓవర్లు బౌలింగ్ చేసిన శ్రీశాంత్.. 65 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కేరళ జట్టు 48.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. టీమిండియా తరఫున 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20లు ఆడాడు శ్రీశాంత్. అయితే తాజాగా ఐపీఎల్ మినీ వేలం కోసం పేరును నమోదుచేసుకున్నా.. శ్రీశాంత్‌ను ఎవరూ పిక్ చేసుకోలేదు.