AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

David Warner Expects: ఐపీఎల్‌లో వార్నర్ ఆడతాడా..? దూరమవుతాడా..? ఆ గాయం తిరగబెట్టిందా..?

ఐపీఎల్‌-14కు వార్నర్ ఆడతాడా..? దూరమవుతాడా..? ఆస్ట్రేలియా స్టార్​ ఓపెనర్​ డేవిడ్​ వార్నర్​ ఈ సారి ఐపీఎల్​కు దూరం కానున్నాడా? అంటే అవుననే తెలుస్తోంది. గతేడాది ఇండియాతో..

David Warner Expects: ఐపీఎల్‌లో వార్నర్ ఆడతాడా..? దూరమవుతాడా..? ఆ గాయం తిరగబెట్టిందా..?
David Warner
Sanjay Kasula
| Edited By: uppula Raju|

Updated on: Feb 23, 2021 | 12:44 AM

Share

David Warner : ఐపీఎల్‌-14కు వార్నర్ ఆడతాడా..? దూరమవుతాడా..? ఆస్ట్రేలియా స్టార్​ ఓపెనర్​ డేవిడ్​ వార్నర్​ ఈ సారి ఐపీఎల్​కు దూరం కానున్నాడా? అంటే అవుననే తెలుస్తోంది. గతేడాది ఇండియాతో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా వార్నర్‌కు గాయమైంది. రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా తొడకండరాలు పట్టేసి నడవలేని స్థితికి చేరాడు. దీంతో ఫిజియో సిబ్బంది వచ్చి అతడిని తమతో తీసుకెళ్లారు. కానీ టెస్టు సిరీస్‌లో జట్టు ఓడిపోతుండడంతో తిరిగి జట్టులోకొచ్చాడు. కానీ అంత గొప్ప ప్రదర్శన ఏమీ చేయలేదు. అయితే గాయం మాత్రం మళ్లీ తిరగబెట్టింది. దీంతో అతడు మళ్లీ వైద్యుల సూచనల మేరకు తిరిగి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇంకొన్ని నెలలు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు అతడు వెల్లడించాడు.

తొడ గాయం కారణంగా మరో తొమ్మిది నెలలు క్రికెట్​కు దూరమవుతానని ఆస్ట్రేలియా స్టార్​ ఓపెనర్​ డేవిడ్ వార్నర్​ తెలిపాడు. గత నవంబర్​లో భారత్​తో వన్డే సందర్భంగా గాయపడ్డ వార్నర్​.. తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. చివరి రెండు టెస్టులు ఆడినప్పటికీ.. అంతా సౌకర్యవంతంగా కనిపించలేదు.

పరుగు తీసేటప్పుడు తొడలో నొప్పి వస్తుందని వెల్లడించాడు. ఇంకొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారని ప్రకటించాడు. ఆరు నుంచి తొమ్మిది నెలలు ఆటకు దూరంగా ఉండాలని సూచించారని ప్రకటించాడు. కానీ, వీలైనంత త్వరగా నా గాయాన్ని వైద్యులు నయం చేస్తారనే నమ్మకం నాకుందని డేవిడ్​ వార్నర్ పేర్కొన్నాడు.

వార్నర్​ తన గాయం గురించి బహిరంగంగానే చెప్తున్నప్పటికీ.. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే స్క్వాడ్​లో ఇంకా అతని పేరు ఉంది. ఏప్రిల్​లో ప్రారంభం కానున్న ఐపీఎల్​లోనూ సన్​రైజర్స్​ జట్టుకు డేవిడ్ కెప్టెన్​గా ఉన్నాడు.

ఇది కూడా చదవండి

తలలు పగిలాయి.. చేతులు విరిగాయి.. ఒక్కరికి కాదు.. ఇద్దరికి కాదు.. కేరళ అసెంబ్లీ ముట్టడిలో హై టెన్షన్..