David Warner Coments: మ్యాక్స్‌వెల్ భారీ ధర పలకడం ఆశ్చర్యమనిపించింది.. హాట్ కామెంట్స్ చేసిన సన్ రైజర్స్ ఆటగాడు..

David Warner Coments: ఐపీల్ వేలంలో మ్యాక్స్‌వెల్ భారీ ధర పలకడంతో ఆశ్చర్యానికి గురయ్యానని చెబుతున్నాడు సన్ రైజర్ కెప్టెన్ డేవిడ్ వార్నర్. ఆస్ట్రేలియా×న్యూజిలాండ్‌

David Warner Coments: మ్యాక్స్‌వెల్ భారీ ధర పలకడం ఆశ్చర్యమనిపించింది.. హాట్ కామెంట్స్ చేసిన సన్ రైజర్స్ ఆటగాడు..
Follow us
uppula Raju

|

Updated on: Feb 23, 2021 | 4:58 AM

David Warner Coments: ఐపీల్ వేలంలో మ్యాక్స్‌వెల్ భారీ ధర పలకడంతో ఆశ్చర్యానికి గురయ్యానని చెబుతున్నాడు సన్ రైజర్ కెప్టెన్ డేవిడ్ వార్నర్. ఆస్ట్రేలియా×న్యూజిలాండ్‌ మ్యాచ్‌కు కామెంటర్‌గా వెళ్లిన వార్నర్‌.. బౌలింగ్ చేస్తున్న మ్యాక్స్‌వెల్ గురించి హాట్ కామెంట్స్ చేశాడు. ఓ ఫ్రాంఛైజీ వదులుకున్న మాక్స్‌వెల్‌ను మరో ఫ్రాంఛైజీ భారీ ధరకు దక్కించుకోవడం ఆశ్చర్యంగా ఉందని అన్నాడు.

పంజాబ్‌ వదులుకున్న మాక్స్‌వెల్‌ను ఐపీఎల్‌ వేలంలో బెంగళూరు రూ.14.25 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీనికి మరో వ్యాఖ్యాత మార్క్‌ వా స్పందిస్తూ.. ‘‘గత ఐపీఎల్‌ సీజన్‌ ప్రదర్శన ఆధారంగా తీసుకున్నారనుకుంటా’’ అని సరదాగా బదులిచ్చాడు. 2020 ఐపీఎల్‌లో మాక్సీ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. పంజాబ్ తరఫున 13 మ్యాచ్‌లు ఆడిన అతడు 15 సగటుతో 108 పరుగులే చేశాడు. అంతేగాక అతడు ఒక్క సిక్సర్‌ కూడా సాధించకపోవడం గమనార్హం. మరి ఈ ఐపీల్‌లో ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి.

హైదరాబాద్ పాతబస్తీ పరిధిలో మైనర్ బాలికల కిడ్నాప్.. టాబ్లెట్‌ మింగించి అఘాయిత్యానికి ప్రయత్నం..