AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devon Conway: నాలుగు రోజులు లేటయ్యింది.. జస్ట్ మిస్ బ్రదర్.. లేదంటే కోట్లు కొల్లగొట్టేవాడివి..!

Ravichandran Ashwin Tweet: ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్ ఐపీఎల్. ఈ టోర్నమెంట్‌లో ఆడాలని ప్రతీ క్రికెటర్ కోరుకుంటాడు...

Devon Conway: నాలుగు రోజులు లేటయ్యింది.. జస్ట్ మిస్ బ్రదర్.. లేదంటే కోట్లు కొల్లగొట్టేవాడివి..!
Ravi Kiran
|

Updated on: Feb 23, 2021 | 10:18 AM

Share

Ravichandran Ashwin Tweet: ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్ ఐపీఎల్. ఈ టోర్నమెంట్‌లో ఆడాలని ప్రతీ క్రికెటర్ కోరుకుంటాడు. అయితే ఆ అవకాశం అందరికీ రాదు. చాలా తక్కువ మందికే దొరుకుతుంది. ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేసుకుంటారు.

ఇటీవల చెన్నై వేదికగా ఐపీఎల్ 2021 మినీ ఆక్షన్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేలం పాటలో చాలామంది ఆటగాళ్లు భారీ ధరలు పలికారు. అంతేకాకుండా డొమెస్టిక్ క్రికెట్‌లో రాణిస్తున్న కొత్తవారికి, యువకులకు సైతం ఛాన్స్ లభించింది. అయితే ఈ వేలం గనుక నాలుగు రోజుల తర్వాత జరిగి ఉంటే ఓ ఆటగాడిని కోట్లు పెట్టి కోనేవాళ్లని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక అతనే న్యూజిలాండ్‌కు చెందిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ డేవాన్‌ కాన్‌వే.

డేవాన్ కాన్‌వే ఐపీఎల్ వేలం పాటలో తన పేరును నమోదు చేసుకున్న ఏ ఫ్రాంచైజీ కూడా అతడిని కొనుగోలు చేయడంపై ఆసక్తి చూపించలేదు. అయితే అందుకు నిరుత్సాహ పడకుండా కాన్‌వే ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో 59 బంతుల్లో 99 ప‌రుగులు చేసి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. ఆరు టీ20 మ్యాచ్ ఆడిన కాన్‌వేపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించేందుకు కాన్‌వే ఇన్నింగ్స్ కాస్త లేట్ అయిందని.. అందుకే ఐపీఎల్ ఛాన్స్ మిస్సయాడని అందరూ అంటున్నారు. ఇదే విషయాన్ని ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ కూడా ప్రస్తావిస్తూ.. తన ట్విట్టర్ ద్వారా అద్భుతమైన ట్వీట్ చేశాడు. ”కాన్‌వే ఇజ్ జస్ట్ ఫోర్ డేస్ లేట్.. జస్ట్ మిస్ బ్రదర్.. బట్ సూపర్బ్ ఇన్నింగ్స్’ అంటూ పేర్కొన్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి:

ఈ ఫోటోలోని రాజకీయ నాయకుడిని గుర్తుపట్టారా.! ఎక్కడో చూసినట్లు ఉందా.?

ఏటీఎం పిన్ మర్చిపోయారా.! డోంట్ వర్రీ.. ఎస్‌బీఐ సరికొత్త ఫీచర్.. వివరాలివే.!

రెప్పపాటులో ఘోరం.. సెల్‌ఫోన్ మోజులో ఒకరు.. ర్యాష్ డ్రైవింగ్‌తో మరొకరు.. వీడియో వైరల్.!

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ వేదికలు ఖరారు.. వివరాలు ఇవిగో.!

Follow Us
కస్తూర్బా స్కూల్ వైరల్ వీడియో: దేవతలు, దయ్యాలు అంటూ విద్యార్థిని
కస్తూర్బా స్కూల్ వైరల్ వీడియో: దేవతలు, దయ్యాలు అంటూ విద్యార్థిని
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం