Telangana Election: మా సమస్య తీరలేదు.. ఓట్లు అడిగే అర్హత మీకు లేదు అంటూ వెలసిన ఫ్లెక్సీ
ప్రజాస్వామ్యంలో ఓటుకు మించిన ఆయుధం ఏముంది? తమ సమస్యలు పరిష్కరించని రాజకీయ నేతలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు చైతన్యమవుతున్నారు. ఎన్నికల వేళ నేతలను దిగివచ్చేలా చేయాలంటే ఓటు సరైనదని భావిస్తుంటారు. మా సమస్యలు పట్టవు.. మా ఓట్లు మీకు కావాలా..? అంటూ తమ ఇంటి ముందు ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది ఓ కుటుంబం.

ప్రజాస్వామ్యంలో ఓటుకు మించిన ఆయుధం ఏముంది? తమ సమస్యలు పరిష్కరించని రాజకీయ నేతలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు చైతన్యమవుతున్నారు. ఎన్నికల వేళ నేతలను దిగివచ్చేలా చేయాలంటే ఓటు సరైనదని భావిస్తుంటారు. మా సమస్యలు పట్టవు.. మా ఓట్లు మీకు కావాలా..? అంటూ తమ ఇంటి ముందు ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది ఓ కుటుంబం. మా కాలనీ సమస్యలు పట్టని ప్రజా ప్రతినిధులు ఇప్పుడు మా ఓటు కావాలా అంటూ వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఫ్లెక్సీ ద్వారా రాజకీయ నేతలను ప్రశ్నిస్తున్న కుటుంబం ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో 8వ వార్డులో సందీప్, సాయికుమారి దంపతులు నివాసం ఉంటున్నారు. తమ కాలనీలో ప్రధాన సమస్యగా మారిన మురికి కాలువల కోసం ఎన్నో ఏళ్లుగా ఎంతమంది ప్రజా ప్రతినిధులకు, అధికారులకు మొరపెట్టుకున్నామన్నారు. అయినా పరిష్కారం దొరకపోవడంతో అసెంబ్లీ ఎన్నికలను ఆయుధంగా మార్చుకున్నారు. ప్రజా సమస్యలను ఓట్లతో లింక్ పెట్టారు. ప్రచారం కోసం అభ్యర్థులను ఆకర్షించేలా వినూత్న నిరసనకు ఫ్లాన్ చేశఆరు సందీప్ దంపతులు.
మా బాధలు మీకు పట్టలేదు మా సమస్య తీర్చ లేదంటూ ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇన్నాళ్లైనా తమను పట్టించుకున్న నాథుడే లేడంటూ ఫ్లెక్సీతో ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను అర్థం చేసుకోలేదని, అటువంటప్పుడు తాము ఓటువేసి ఏం ప్రయోజనం? అని నిలదీస్తున్నారు. మురికి కాలువలతో కుటుంబం మొత్తం రోగాల బారిన పడుతున్నామని, అనారోగ్యానికి గురైన ఆస్పత్రుల పాలవుతూ, ఆర్థికంగా నష్టపోతున్నామని, మా బాధలు పట్టవు.. మా ఓట్లు అడిగే అర్హత మీకు లేదని అంటున్నారు. ఓట్ల కోసం మీరు మా ఇంటికి రావద్దు అంటూ రాజకీయ నేతలను ఫ్లెక్సీ ద్వారా సందీప్, సాయి కుమారి దంపతులు తేల్చి చెప్పేశారు. ఈ దంపతుల ఫ్లెక్సీ నిరసన అందరిని ఆకట్టుకుంటుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
