Bandi Sanjay: ఒకరిద్దరు చెప్పినంత మాత్రాన సీఎంను కాలేను.. బీజేపీ నేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..
Telangana Assembly Election 2023: తెలంగాణలో బీసీలకు బీజేపీతో మాత్రమే న్యాయం జరుగుతుందని కరీంనగర్ ఎంపీ, బీజేపీ నేత బండి సంజయ్ పేర్కొన్నారు. బీసీలనే సీఎం చేస్తామని బీజేపీ ఇప్పటికే ప్రకటించిందని తెలిపారు. అంతేకాకుండా 50 శాతం టిక్కెట్లను బీసీలకే కేటాయించినట్టు తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని సీఎం చేస్తామన్నామని.. బీఆర్‌ఎస్ , కాంగ్రెస్ పార్టీలు బీసీ నేతను సీఎంగా ప్రకటించే దమ్ముందా..? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Telangana Assembly Election 2023: తెలంగాణలో బీసీలకు బీజేపీతో మాత్రమే న్యాయం జరుగుతుందని కరీంనగర్ ఎంపీ, బీజేపీ నేత బండి సంజయ్ పేర్కొన్నారు. బీసీలనే సీఎం చేస్తామని బీజేపీ ఇప్పటికే ప్రకటించిందని తెలిపారు. అంతేకాకుండా 50 శాతం టిక్కెట్లను బీసీలకే కేటాయించినట్టు తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని సీఎం చేస్తామన్నామని.. బీఆర్‌ఎస్ , కాంగ్రెస్ పార్టీలు బీసీ నేతను సీఎంగా ప్రకటించే దమ్ముందా..? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్ లో జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభను విజయవంతం చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలు బీసీ ఆత్మగౌరవ సభలను విజయవంతం చేయాలని కోరారు. బీసీ కమిషన్‌ను నియమించిన ఘనత బీజేపీదేనన్నారు. బీసీలకు బీఆర్‌ఎస్, బీజేపీ అన్యాయం చేస్తున్నాయని.. వారి మాటలను నమ్మొద్దంటూ కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీసీలకు క్షమాపణ చెప్పాలి.. ఆ రెండు పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు. రేపు కరీంనగర్ అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నానని బండి సంజయ్ తెలిపారు. బీసీలకు బీజేపీతోనే న్యాయం జరుగుతుందని ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.
బీసీ సీఎం అని బీజేపీ ప్రకటించిన తరుణంలో ముఖ్యమంత్రి అవుతారా..? అన్న ప్రశ్నకు బండి సంజయ్ స్పందించారు. ఒకరిద్దరు చెప్పినంత మాత్రాన తాను సీఎంను కాలేనని, సీఎం పదవిపై మోజు లేదని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఎమ్మెల్యేలు , పార్టీ హైకమాండ్ సీఎం అభ్యర్ధిని డిసైడ్ చేస్తారని అన్నారు. ముందు సీఎం అభ్యర్ధిని ప్రకటించే సాంప్రదాయం బీజేపీలో లేదంటూ బండి సంజయ్ స్పష్టంచేశారు.
బండి సంజయ్ వీడియో చూడండి..
కాగా.. బీజేపీ మూడో లిస్ట్ పై కసరత్తులు జరగుతున్నాయి. బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఫిక్స్ అయిన నేపథ్యంలో.. సీట్ల కేటాయింపు అంశం తర్వాత అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇప్పటికే సీట్ల కేటాయింపు అంశంపై పవన్ కల్యాణ్, కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. భేటీ అనంతరం తాను ప్రధాని మోదీ పాల్గొనబోయే బీసీ సదస్సులో పాల్గొంటానంటూ పవన్ కల్యాణ్ ప్రకటించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
