Telangana Election: పోలింగ్‌కు మిగింది కొద్ది గంటలే.. భారీగా పట్టుబడుతున్న నగదు, తాయిలాలు

. మరి కొద్ది గంటల్లోనే పోలింగ్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో నోట్ల కట్టలు ఇంకా పట్టుబడుతూనే ఉన్నాయి. హైదరాబాద్ టు ఆదిలాబాద్‌.. ఎక్కడ చూడు ఓటుకు నోటు స్కీమ్‌ పోలీసులను పరేషాన్ చేస్తోంది.

Telangana Election: పోలింగ్‌కు మిగింది కొద్ది గంటలే.. భారీగా పట్టుబడుతున్న నగదు, తాయిలాలు
Assembly Polls Heavily Seized Cash And Gifts
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 29, 2023 | 9:08 PM

సమయం లేదు మిత్రమా.. నోట్లు పంచు, ఓట్లు రాబట్టు.. అంటున్నారు నేతలు. మరి కొద్ది గంటల్లోనే పోలింగ్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో నోట్ల కట్టలు ఇంకా పట్టుబడుతూనే ఉన్నాయి. హైదరాబాద్ టు ఆదిలాబాద్‌.. ఎక్కడ చూడు ఓటుకు నోటు స్కీమ్‌ పోలీసులను పరేషాన్ చేస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మరి కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. దీంతో ఉన్న ఈ కాస్త సమయాన్ని దుర్వినియోగం చేయడానికి అన్ని రకాల మార్గాలను ఉపయోగించుకుంటున్నారు రాజకీయ పార్టీల నేతలు. ఓటర్లకు తాయిలాలు పంచేందుకు అడ్డగోలు మార్గాలను వెతుక్కుంటున్నారు. పోలీసులకు అడ్డంగా బుక్కవుతున్నారు. కొమురంభీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గ కేంద్రంలో పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో 60 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ డబ్బును గూడ్స్ వాహనంలో అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నగదు తరలిస్తోందీ బీజేపీ అభ్యర్థి అనుచరుడిగా అనుమానిస్తున్నారు.

ఇక కొడంగల్‌లో ఓటర్లకు డబ్బు పంపిణీతో కలకలం రేగింది. దౌల్తాబాద్ మండలం చెల్లాపూర్ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ డబ్బులు పంపిణీ చేస్తున్న బీఆర్ఎస్ నేత, మాజీ జెడ్పీటీసీ పరికప్ప ఆయన కుమారుడు శ్యామ్ సుందర్‌ని కాంగ్రెస్‌ నేతలు పట్టుకున్నారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య తోపులాట జరిగింది. ఈ సంఘటనపై పోలీసులకు కాంగ్రెస్‌ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.

మరోవైపు మంచిర్యాల బీజేపీ అభ్యర్థి రఘునాథ్ బంధువు ఇంట్లో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హాజీపూర్ మండలంలోని మాధవరపు వెంకట రమణారావు ఇంట్లో….ఎలాంటి ధ్రువపత్రాలు లేని 55 లక్షల నగదు పట్టుబడింది. ఈ సొమ్మును ఫ్లయింగ్ స్క్వాడ్‌కు పోలీసులు అప్పగించారు. ఇది బీజేపీ అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లికి చెందిన డబ్బుగా పోలీసులు గుర్తించారు.

మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి శ్రీరాంపూర్‌కు రెండు ద్విచక్ర వాహనాలపై తరలిస్తున్న 197 చీరలను సీసీసీ కార్నర్ దగ్గర ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న చీరలను నస్పూర్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ప్రజలను ప్రలోభపెట్టేందుకు వీటిని తరలిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు.

ఇక ఇదిలావుంటే పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో ఎన్నికల సంఘానికి తెగ ఫిర్యాదులు వస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో డబ్బు పంపిణీ చేస్తున్నారని, కొన్ని నియోజకవర్గాల్లో ఫలానా టైమ్‌కి డబ్బు పంపిణీ చేస్తారంటూ ఈసీకి కంప్లయింట్లు అందుతున్నాయి. మరోవైపు 1950 నెంబర్‌కి కాల్‌ చేసి..తమ సంస్థలకు పోలింగ్‌ రోజున సెలవు ఇవ్వడం లేదంటూ పలు ప్రైవేట్ సంస్థలు, కళాశాలల నుంచి వరుస ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక అధికారులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో స్టేట్ ఎలక్షన్ కమిషన్‌కు కంప్లయింట్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలకు గురువారం సెలవు ఇవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. సెలవు ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఎలక్షణ్ కమిషన్ వార్నింగ్‌ ఇచ్చింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే