TV9 సత్తాబజార్‌ పేరిట సర్క్యులేట్‌ అవుతున్న ఫేక్ సర్వే.. దీంతో టీవీ9కి ఎలాంటి సంబంధం లేదు

ఎన్నికలు వచ్చాయంటే చాలు.. ఫేక్ సర్వేలు, ఫేక్ రిపోర్టులతో ఓటర్లను మాయ చేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల నేపథ్యంలోనూ సోషల్ మీడియాలో చాలా ఫేక్ సర్వేలు వైరల్ అవుతున్నాయి. టీవీ9 పేరుతోనూ ఓ ఫేక్ సర్వే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఆ సర్వేతో టీవీ9కి ఎలాంటి సంబంధం లేదు. టీవీ9 ఎలాంటి ప్రీ పోల్ సర్వే నిర్వహించలేదు.

TV9 సత్తాబజార్‌ పేరిట సర్క్యులేట్‌ అవుతున్న ఫేక్ సర్వే.. దీంతో టీవీ9కి ఎలాంటి సంబంధం లేదు
Fake Survey
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 29, 2023 | 9:11 PM

ఎన్నికలు వచ్చాయంటే చాలు.. ఫేక్ సర్వేలు, ఫేక్ రిపోర్టులతో ఓటర్లను మాయ చేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల నేపథ్యంలోనూ సోషల్ మీడియాలో చాలా ఫేక్ సర్వేలు వైరల్ అవుతున్నాయి. టీవీ9 సత్తా బజార్ పేరుతోనూ ఓ ఫేక్ సర్వే సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతోంది. ఆ సర్వేతో టీవీ9కి ఎలాంటి సంబంధం లేదు. టీవీ9 ఎలాంటి ప్రీ పోల్ సర్వే నిర్వహించలేదని టీవీ 9 యాజమాన్యం స్పష్టం చేసింది. గతంలో జరిగిన ఎన్నికల సమయంలోనూ టీవీ9 పేరిట ఫేక్ సర్వే సర్క్యులేట్ అయింది. ఇప్పుడు కూడా అదే సత్తా బజార్ పేరుతో ఓ ఫేక్ సర్వే సోషల్ మీడియాలో తిరుగుతోంది. ఇలా తప్పుడు ప్రచారం చేసే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని టీవీ9 యాజమాన్యం స్పష్టం చేసింది.

గత రెండు రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా కొన్ని ఫేక్​ సర్వేలు హల్​చల్ ​చేస్తున్నాయి. అభ్యర్థుల వివరాలు, అసెంబ్లీ స్థానాలతో నిమిత్తం లేకుండా ఫలితాలు బయటకొస్తున్నాయి. తప్పుడు లెక్కలు వేసి సర్వేలు రిలీజ్ చేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. జనాలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పోలింగ్‌కు ముందు ఫేక్ సర్వేలు హల్​‌చల్ చేస్తుండటంతో జనాలు అయోమయం పడుతున్నారు. వాస్తవానికి జనాలను గందరగోళానికి గురిచేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ఫేక్ ​సర్వేలను సోషల్​ మీడియాలో వదిలి విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీవీ9 కోరుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..