AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ముంబై రైలులో భారీ లగేజ్‌తో కనిపించిన మహిళ.. దగ్గరకెళ్లి చూడగా షాక్..!

తెలంగాణ ఈగల్ టీం అధికారులు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో గురువారం హైదరాబాద్‌లో గంజాయి తరలిస్తున్న మహిళను అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి సుమారు రూ.8 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన మమతా దిగాల్ ప్రస్తుతం నవీ ముంబైలో నివాసం ఉంటుంది.

Hyderabad: ముంబై రైలులో భారీ లగేజ్‌తో కనిపించిన మహిళ.. దగ్గరకెళ్లి చూడగా షాక్..!
Ganjai Illegally Transporting
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Jan 23, 2026 | 5:35 PM

Share

తెలంగాణ ఈగల్ టీం అధికారులు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో గురువారం హైదరాబాద్‌లో గంజాయి తరలిస్తున్న మహిళను అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి సుమారు రూ.8 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన మమతా దిగాల్ ప్రస్తుతం నవీ ముంబైలో నివాసం ఉంటుంది. ఆమె భువనేశ్వర్ నుంచి ముంబైకి వెళ్తున్న సమయంలో బేగంపేట రైల్వే స్టేషన్ వద్ద భారీ లగేజ్‌తో అనుమానాస్పదంగా కనిపించింది దీంతో ఈగిల్ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు.

బేగంపేట రైల్వే స్టేషన్ వద్ద భారీ లగేజ్‌ ఉన్న సూట్‌కేస్‌తో మహిళ అటు ఇటుగా తిరుగుతోంది. అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీ చేశారు. దీంతో తొమ్మిది ప్యాకెట్ల గంజాయి బయటపడింది. విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ముంబైకి చెందిన డ్రగ్ పెడ్లర్ అశోక్ ఆదేశాల మేరకు భువనేశ్వర్‌కు వెళ్లినట్లు చెప్పింది. అక్కడ గుర్తు తెలియని వ్యక్తి నుంచి గంజాయి ఉన్న సూట్‌కేస్‌ను అందుకున్నట్లు మమతా తెలిపింది. ఒక్కో గంజాయి బ్యాగ్ తరలింపునకు రూ.10 వేల చొప్పున అశోక్ చెల్లిస్తారని పోలీసులకు వివరించింది.. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, అశోక్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇంట్లోనే గంజాయి దుకాణం..!

మరో ఘటనలో ఎక్సైజ్ శాఖ స్పెషల్ టీమ్ నాంపల్లి మంగారుబస్తీలోని ఓ ఇంటిపై దాడులు నిర్వహించింది. గణేష్, సరళ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది ఇంట్లోనే గంజాయిని చిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో అధికారులు సోదాలు చేపట్టారు. వారి వద్ద నుంచి 1.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 180 చిన్న ప్యాకెట్లు బయటపడ్డాయి. ఈ కేసులో మహమ్మద్ సోహైల్, యు.సీతల్ అనే మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..