Hyderabad: రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పందంగా కనిపించిన యువతి.. ఆపి చెక్ చేయగా
తెలంగాణలో మరోసారి భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు రాష్ట్ర ఈగల్ టీం అధికారులు. తెలంగాణను డ్రగ్స్, గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పనిచేస్తున్న అధికారులు అక్రమంగా వీటిని తరలిస్తున్న వారిపై ఉక్కుపాదం మొపుతున్నారు. ఇందులో భాగంగానే ట్రైన్‌లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఓ యుతని అదుపులోకి తీసుకున్నారు. ఆమెనుంచి ఏకంగా సుమారు రూ.8 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణ ఈగల్ టీం అధికారులు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో గురువారం హైదరాబాద్‌లో గంజాయి తరలిస్తున్న మహిళను అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి సుమారు రూ.8 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన మమతా దిగాల్ ప్రస్తుతం నవీ ముంబైలో నివాసం ఉంటుంది. ఆమె భువనేశ్వర్ నుంచి ముంబైకి వెళ్తున్న సమయంలో బేగంపేట వద్ద భారీ లగేజ్‌తో అనుమానాస్పదంగా కనిపించడంతో.. ఈగిల్ అధికారులు పట్టుకున్నారు.
ఆమె సూట్‌కేస్‌లు తనిఖీ చేయగా తొమ్మిది ప్యాకెట్ల గంజాయి బయటపడింది. విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ముంబైకి చెందిన డ్రగ్ పెడ్లర్ అశోక్ ఆదేశాల మేరకు భువనేశ్వర్‌కు వెళ్లినట్లు, అక్కడ గుర్తు తెలియని వ్యక్తి నుంచి గంజాయి ఉన్న సూట్‌కేస్‌ను అందుకున్నట్లు మమతా తెలిపింది. ఒక్కో గంజాయి బ్యాగ్ తరలింపుకు రూ.10 వేల చొప్పున అశోక్ చెల్లిస్తానని చెప్పినట్లు వెల్లడించింది. అశోక్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
మరో ఘటనలో ఎక్సైజ్ శాఖ స్పెషల్ టీమ్ నాంపల్లి మంగారు బస్తీలోని ఓ ఇంటిపై దాడులు నిర్వహించింది. గణేష్, సరళ అనే ఇద్దరు వ్యక్తులు ఇంట్లోనే గంజాయిని చిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో అధికారులు సోదాలు చేపట్టారు. వారి వద్ద నుంచి 1.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 180 చిన్న ప్యాకెట్లు బయటపడ్డాయి. ఈ కేసులో మహమ్మద్ సోహైల్, యు.సీతల్ అనే మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని అధికారులు వెల్లడించారు.

Ganja Smuggling Hyderabad
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
