ములక్కాయ మటన్ కర్రీ ఇలా వండి తింటే.. ఆ కిక్కే వేరబ్బా! 

Prasanna Yadla

23 January 2026

Pic credit - Pixabay

ఆదివారం వస్తే చాలు మటన్ ఇంట్లో ఉడకాల్సిందే. మనం ఇప్పటికి దీంతో, ఎన్నో వైరైటీలు తిని తింటాము. అయితే, వాటిలో ములక్కాయ మటన్ అయితే రుచి కరంగా ఉంటుంది. ఇంకెందుకు లేట్ దీన్ని ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.. 

ములక్కాయ మటన్ కర్రీ

మటన్ , ఉల్లిపాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు, ఆయిల్, టమోటా, మిర్చి, చింత పండు రసం,  అల్లం వెల్లుల్లి పేస్ట్,  ఉప్పు, కారం, పసుపు.

కావాల్సిన పదార్థాలు  

ముందుగా కుక్కర్‌లో  2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని బాగా వేడి చేయండి. ఆ తర్వాత దానిలో 1 బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు ముక్కలు, 3 మిర్చి వేసుకోండి. 

స్టెప్ - 1

ముందుగా కుక్కర్‌లో  2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని బాగా వేడి చేయండి. ఆ తర్వాత దానిలో 1 బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు ముక్కలు, 3 మిర్చి వేసుకోండి. 

స్టెప్ - 2

ఇక ఆ తర్వాత టమోటా ముక్కలు వేసి 3 నిమిషాల పాటు బాగా ఉడికించండి. ప్రెజర్ కుక్కర్ లో టమోటా నిముషాల్లోనే ఉడికిపోతుంది. 

స్టెప్ - 3

ఇప్పుడు 500 గ్రాముల మటన్‌ను తీసుకుని ప్రెజర్ కుక్కర్ లో వేయండి. దీని కోసం మెత్తని మటన్‌ను తీసుకోండి. లేదంటే మీకు  గ్రేవీ కొంచం కూడా  రాదు.

స్టెప్ - 4

1 టేబుల్ స్పూన్ చింతపండు రసం,  ఉప్పు వేసుకుని బాగా కలపండి. ఆ తర్వాత ఒక గ్లాస్ నీళ్లు పోసి కుక్కర్ మూత గట్టిగా పెట్టండి. నాలుగు సార్లు విజిల్స్ వచ్చే వరకు అలాగే  ఉంచండి. 

స్టెప్ - 5

ఆ తర్వాత కుక్కర్ మూత తీసి ములక్కాడ ముక్కలను వేసి  మళ్ళీ ప్రెజర్ కుక్ చేయండి. ఈసారి 2 విజిల్స్  వచ్చే వరకు ఉంచండి. 15 నిముషాల తర్వాత మూత తీసి చూసిన తర్వాత దించేయండి. 

స్టెప్ - 6

అంతే వేడి వేడి ములక్కాడ , మటన్ కర్రీ రెడీ. ఇంకెందుకు లేట్ అన్నంతో కానీ, చపాతీ తో కానీ తింటే రుచి కరంగా ఉంటుంది.

ములక్కాడ , మటన్ కర్రీ రెడీ!