Telangana crime: ప్రేమ పేరుతో బాలికపై అత్యాచారం.. ఆపై వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన నిందితులు అరెస్ట్!
మాయ మాటలు చెప్పి, ప్రేమించానని చెప్పి బాలికను లోబరచుకుని, ఆపై వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకెళ్తే.. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన..
మాయ మాటలు చెప్పి, ప్రేమించానని చెప్పి బాలికను లోబరచుకుని, ఆపై వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకెళ్తే.. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఇద్దరి నిందితుల వివరాలను సోమవారం మీడియా సమావేశంలో ఏసీపీ రఘుచందర్ వెల్లడించారు.
చిల్పూరు మండలం శ్రీపతిపల్లికి చెందిన గుర్రం శ్యాం అనే యువకుడు ఓ బాలికకు (16) ప్రేమ పేరుతో వల వేశాడు. తన మాయమాటలతో బాలికను నమ్మించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన తుపాకుల సాంబరాజు అనే మరో యువకుడు వీడియో తీశాడు. ఇద్దరూ కలిసి మరో నలుగురు బాలికలకు ఈ వీడియోను చూపించి, తాము చెప్పినట్లు వినకపోతే మీ వీడియోలు కూడా తీస్తామని బెదిరించారు. వీరిద్దరు అత్యాచారం వీడియోను ఫోన్‌లో కొందరికి షేర్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయం బాధితురాలి తల్లికి తెలియడంతో ఆమె చిల్పూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు బాలికను విచారించి గుర్రం శ్యాం, సాంబరాజును అరెస్టు చేసి, విచారించగా నేరం అంగీకరించారు. ఈ ఘటనలో మరో నలుగురు మైనర్ బాలురులకు సంబంధం ఉన్నట్లు నిందితులు తెలిపారు. అత్యాచారం, పోక్సో చట్టం కింద వీరిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ రఘుచందర్ వెల్లడించారు. బాధితురాలిని జనగాన్ ప్రభుత్వా ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు.