AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monkeys Attack: దారుణం.. ఇంట్లోకి చొరబడి వృద్ధురాలిపై కోతుల మూక దాడి..! ఎవరో చేయించినట్టు..(వీడియో)

Monkeys Attack: దారుణం.. ఇంట్లోకి చొరబడి వృద్ధురాలిపై కోతుల మూక దాడి..! ఎవరో చేయించినట్టు..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Oct 04, 2022 | 7:36 PM

సూర్యాపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కోతుల మూక ఓ వృద్ధురాలి ప్రాణం తీశాయి. ఎవరూ లేని సమయంలో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. తీవ్ర రక్తస్రావంతో వృద్ధురాలు ప్రాణాలు విడిచింది.


సూర్యాపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కోతుల మూక ఓ వృద్ధురాలి ప్రాణం తీశాయి. ఎవరూ లేని సమయంలో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. తీవ్ర రక్తస్రావంతో వృద్ధురాలు ప్రాణాలు విడిచింది. ఈ ఘటన ఆత్మకూర్(ఎస్) మండలం పాత సూర్యాపేటలో వెలుగు చూసింది. పక్షవాతంతో మంచాన పడ్డ వృద్దురాలు ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో చొరబడ్డ కోతుల మంద వృద్ధురాలిపై మూకుమ్మడిగా దాడి చేశాయి. దీంతో వృద్ధురాలు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకం రేపుతోంది. కోతుల గుంపు ఒక వ్యక్తి ప్రాణాలు తీయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఊళ్లో కోతుల ఆగడాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయని, కోతుల బెడద నుంచి రక్షించాలంటూ అధికారులను వేడుకుంటున్నారు గ్రామస్తులు. కాగా, వృద్ధురాలిని కోతులు చంపేయడంపై అధికారులు అలర్ట్ అయ్యారు. కోతులను పారద్రోలేందుకు రంగంలోకి దిగారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్‌ వైరస్‌.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!

 

Published on: Oct 04, 2022 07:36 PM