Telangana: ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేస్తున్న తెల్ల బంగారం ధర.. క్వింటాల్ పత్తి ధర ఎంతంటే..
తెల్ల బంగారం ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ నామ్‌తో రైతులకు రికార్డు ధర లభిస్తోంది. తెల్ల బంగారం ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ నామ్‌తో రైతులకు

తెల్ల బంగారం ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ నామ్‌తో రైతులకు రికార్డు ధర లభిస్తోంది. తెల్ల బంగారం ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ నామ్‌తో రైతులకు రికార్డు ధర లభిస్తోంది. అవును, తెలంగాణలోని ఉమ్మడి మెదక్ జిల్లాలో తెల్ల బంగారం ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. గజ్వేల్ మార్కెట్ యార్డ్‌లో క్వింటా పత్తి 9వేల రూపాయలు దాటింది. అత్యధక ధర 9,330 రూపాయలు పలికింది. ఇది, మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు. కాటన్ క్వాలిటీ ప్రకారం క్వింటా పత్తి 8వేల నుంచి పది వేల రూపాయల్లోపు పలుకుతోందని చెబుతున్నారు.
గజ్వేల్ మార్కెట్‌లోనే కాదు.. ఉమ్మడి మెదక్ జిల్లా అంతటా 9వేల రూపాయల వరకు రేటు లభిస్తోంది. ఈ నామ్ ఇంప్లిమెంట్ చేయడంతో పత్తికి మంచి ధర లభిస్తోందంటున్నారు రైతులు. పత్తి నాణ్యత మేర ధర లభిస్తోందని చెబుతున్నారు. ఈ నామ్ విధానంతో మేలు జరుగుతోందంటున్నారు రైతులు. పత్తి కొనుగోళ్లకు కచ్చితంగా ఈ నామ్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆన్‌లైన్ బిడ్డింగ్‌తో పత్తికి మంచి ధర దొరుకుతోందని అంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన 6వేల 380 రూపాయల మద్దతు ధర కంటే అధికంగా చెల్లించి పత్తిని కొంటున్నారని సంతోషం వ్యక్తంచేస్తున్నారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
